డెలివరీ సమయంలో భార్య మృతి.. భర్త అరెస్ట్

డెలివరీ సమయంలో అధిక రక్తస్రావం కారణంగా భార్య మరణించడంతో భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు.

By Medi Samrat
Published on : 8 April 2025 8:45 PM IST

డెలివరీ సమయంలో భార్య మృతి.. భర్త అరెస్ట్

డెలివరీ సమయంలో అధిక రక్తస్రావం కారణంగా భార్య మరణించడంతో భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. అస్మా (35) అనే మహిళ మరణానికి సంబంధించి కేరళ పోలీసులు భర్త సిరాజుద్దీన్‌పై కేసు నమోదు చేశారు. సిరాజుద్దీన్‌పై నేరపూరిత హత్య, సాక్ష్యాలను నాశనం చేయడం వంటి అభియోగాలు మోపారు. అస్మా కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా పెరుంబవూర్ పోలీసులు అసహజ మరణం కేసు నమోదు చేశారు. ఆ కేసును తరువాత మలప్పురం పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.

సిరాజుద్దీన్ వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నామని మలప్పురం జిల్లా పోలీసు చీఫ్ విశ్వనాధ్ మీడియాకు తెలిపారు. దర్యాప్తులో ఇతర వ్యక్తులు ఎవరైనా ప్రమేయం ఉన్నట్లు తేలితే, వారిని కూడా కేసులో చేర్చుతామని తెలిపారు. సిరాజుద్దీన్ తనకు తాను ఆధ్యాత్మిక వ్యక్తినని చెప్పుకున్నాడని, ఇంటిలోనే డెలివరీని ఎంచుకోవడానికి ఆధ్యాత్మిక కారణాలను ఉదహరించాడని పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు. ఈ జంట మునుపటి రెండు ప్రసవాల సమయంలో కూడా ఇదే విధానాన్ని అనుసరించినట్లు సమాచారం.

దర్యాప్తులో భాగంగా అస్మా కుటుంబ సభ్యులు, స్నేహితుల వాంగ్మూలాలను కూడా సేకరిస్తున్నారు. ఏప్రిల్ 5న తూర్పు కోడూర్‌లోని వారి ఇంట్లో అస్మా తన ఐదవ బిడ్డకు జన్మనిచ్చింది. అధిక రక్తస్రావం కారణంగా ఆమె రాత్రి 10 గంటలకు మరణించింది. ఆమె మరణం తర్వాత, సిరాజుద్దీన్ అంబులెన్స్‌ను అద్దెకు తీసుకుని, అస్మా మృతదేహాన్ని లోపల ఉంచి, తన కారులో మంత్రసాని, నవజాత శిశువుతో పాటు తన నలుగురు పిల్లలను దాదాపు 150 కిలోమీటర్లు ప్రయాణించి పెరుంబవూర్‌లోని అస్మా కుటుంబ ఇంటికి తీసుకెళ్లాడు. సిరాజుద్దీన్ ఎవరికీ సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని పూడ్చడానికి ప్రయత్నించినప్పుడు బంధువులు అతనిని అడ్డుకున్నారు

Next Story