మెట్రో రైలు ముందు దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. డిప్రెషన్‌ కారణంగానే..

34 ఏళ్ల బెంగళూరు వ్యక్తి డిప్రెషన్‌తో బాధపడుతూ సోమవారం రాత్రి హోసహళ్లి మెట్రో స్టేషన్‌లో రైలు ముందు దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

By అంజి  Published on  11 Jun 2024 5:15 AM GMT
Bengaluru, metro train, Crime, Karnataka

మెట్రో రైలు ముందు దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. డిప్రెషన్‌ కారణంగానే..

34 ఏళ్ల బెంగళూరు వ్యక్తి డిప్రెషన్‌తో బాధపడుతూ సోమవారం రాత్రి హోసహళ్లి మెట్రో స్టేషన్‌లో రైలు ముందు దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతను ప్రాణాలతో బయటపడ్డాడు. తలకు స్వల్ప గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో మెట్రో రైలు సర్వీసులకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. ఆ వ్యక్తి బెంగళూరులోని బసవేశ్వర్ నగర్ నివాసి. అయితే, అతని గుర్తింపును పోలీసులు దాచిపెట్టారు.

విజయనగరం ఏసీపీ చందన్‌ మాట్లాడుతూ.. ''బాధితుడు డిప్రెషన్‌తో బాధపడుతూ మెట్రో ట్రాక్‌పై దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తలకు చిన్న గాయం కావడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. డిప్రెషన్‌తో ఉన్న రోగి పేరు, వివరాలను వెల్లడించలేం" అని తెలిపారు.

ఈ ఏడాది మెట్రో ట్రాక్‌లపై ఆత్మహత్యాయత్నం ఇది మూడోసారి. జనవరిలో జరిగిన ఇలాంటి ఘటనలో కేరళకు చెందిన 23 ఏళ్ల యువకుడు జలహళ్లి మెట్రో స్టేషన్‌లో రైలు ముందు దూకాడు . అతను ప్రాణాలతో బయటపడ్డాడు. తలకు గాయాలయ్యాయి. అయితే, మార్చిలో, 19 ఏళ్ల నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (NLSIU) విద్యార్థి దీపాంజలి నగర్ స్టేషన్ వద్ద మెట్రో ట్రాక్‌లపైకి దూకి మరణించాడు.

Next Story