హైదరాబాద్‌లో దారుణం..మద్యం మత్తులో స్నేహితుడిని కొట్టి చంపారు

హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మద్యం మత్తులో జరిగిన గొడవ ఒక వ్యక్తి ప్రాణాలను బలితీసుకుంది.

By -  Knakam Karthik
Published on : 26 Feb 2026 9:03 AM IST

Hyderabad Crime, Mangalhat, Murder Case, Crime News, Hyderabad Police

హైదరాబాద్‌లో దారుణం..మద్యం మత్తులో స్నేహితుడిని కొట్టి చంపారు

హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మద్యం మత్తులో జరిగిన గొడవ ఒక వ్యక్తి ప్రాణాలను బలితీసుకుంది. స్నేహితుల మధ్య తలెత్తిన ఘర్షణ చినికిచినికి గాలివానలా మారి, రిషబ్ అగర్వాల్ (32) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.

వివరాల్లోకి వెళ్తే, మంగళ్‌హాట్ ప్రాంతంలో కొందరు స్నేహితులు కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో వారి మధ్య మాట మాట పెరిగి వివాదం తలెత్తింది. ఆగ్రహంతో ఊగిపోయిన స్నేహితులు రిషబ్ అగర్వాల్‌పై దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు వెంటనే డయల్ 100కు సమాచారం అందించడంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.

పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మంగళ్‌హాట్ పోలీసులు, నిందితుల కోసం గాలింపు చేపట్టారు. అసలు గొడవకు గల కారణాలేంటి? ఈ హత్యలో ఎంతమంది పాల్గొన్నారు? అనే కోణంలో లోతైన దర్యాప్తు చేస్తున్నారు.

Next Story