దారుణం.. మహిళను కాల్చి చంపిన పొరుగింటివారు

31-year-old woman shot by neighbour over enmity in Mumbai. ముంబైలో దారుణం చోటు చేసుకుంది. మన్ ఖుర్ద్ ప్రాంతంలో ఓ మహిళను ఆమె పొరుగువారే

By M.S.R
Published on : 30 April 2023 8:30 PM IST

దారుణం.. మహిళను కాల్చి చంపిన పొరుగింటివారు

ముంబైలో దారుణం చోటు చేసుకుంది. మన్ ఖుర్ద్ ప్రాంతంలో ఓ మహిళను ఆమె పొరుగువారే కాల్చి చంపారని పోలీసులు తెలిపారు. ఇందిరా నగర్ ప్రాంతంలో మహిళకు, ఆమె పొరుగింటి వారికి గొడవ జరిగింది. ఈ ఘటనలో సదరు మహిళను కాల్చి చంపారు. గొడవకు దిగిన పక్కింటి మహిళ భర్త, ఆమె కొడుకు సంఘటన స్థలానికి చేరుకొని ఒక రౌండ్ కాల్పులు జరిపారు. దీంతో బాధితురాలి ఛాతికి గాయమైంది. వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకు వెళ్లగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఆమెను కాల్చిన తర్వాత నిందితుడు, అతని కుమారుడు అక్కడి నుండి పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. తన కూతురుపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ మృతురాలు ఇటీవల నిందితుడి సోదరుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఘటనా స్థలం నుంచి ఆటోరిక్షాలో పారిపోతున్న హంతకుడిని పోలీసులు గుర్తించారు. నిందితులను అరెస్టు చేసేందుకు ప్రధాన రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు ఇతర ప్రాంతాలకు అనేక బృందాలను పంపారు. మృతురాలిని ఇందిరానగర్‌కు చెందిన ఫర్జానా షేక్‌గా గుర్తించారు. హంతకుల్లో ఒకరిని సూరజ్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు.


Next Story