తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లా పొన్నేరి సమీపంలో విషాద ఘటన చోటు చేసుకుంది. జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున మూడున్నరేళ్ల చిన్నారి గొంతులో కొబ్బరి ముక్క ఇరుక్కుపోయింది. అది గొంతును కోయడంతో చిన్నారి మృతి చెందాడు. మృతుడు తిరువళ్లూరు జిల్లా పాక్కం గ్రామానికి చెందిన వసంత్ కుమారుడు సంజీశ్వరన్‌గా పోలీసులు గుర్తించారు. పొద్దున్నే కుటుంబ సభ్యులు వంట పనుల్లో నిమగ్నమై ఉండగా చిన్నారి కొబ్బరికాయ తింటున్నాడని పోలీసులు తెలిపారు. అకస్మాత్తుగా ఒక కొబ్బరి ముక్క అతని గొంతులో ఇరుక్కుపోయింది. అది ఆ చిన్నారి ప్రాణాలు పోయేందుకు దారితీసింది.
భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు కొబ్బరి ముక్కను బయటకు తీయడానికి ప్రయత్నించగా, ఆ క్రమంలో చిన్నారి కుప్పకూలిపోయాడు. శిశువు ఊపిరాడక పోవడంతో బంధువులు పండ్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే కొబ్బరి కాయలో చిక్కుకోవడంతో ఊపిరాడక శిశువు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. మూడేళ్ల చిన్నారి మృతి చెందడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.