ముందొక అమ్మాయి.. వెనుక ఒక అమ్మాయి.. ప్రమాదకరమైన స్టంట్స్

3 Mumbai Youngsters Performs Dangerous Bike Stunts. ముంబయిలో ముందొక అమ్మాయి.. వెనుక ఒక అమ్మాయిని ఉంచుకుని ఓ యువకుడు

By M.S.R  Published on  1 April 2023 2:21 PM IST
ముందొక అమ్మాయి.. వెనుక ఒక అమ్మాయి.. ప్రమాదకరమైన స్టంట్స్

3 Mumbai Youngsters Performs Dangerous Bike Stunts

ముంబయిలో ముందొక అమ్మాయి.. వెనుక ఒక అమ్మాయిని ఉంచుకుని ఓ యువకుడు ప్రమాదకర బైక్‌ విన్యాసాలు చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది. దీంతో ముంబై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. వీడియోలో ఒక యువకుడు హెల్మెట్ లేకుండా ఇద్దరు అమ్మాయిలతో కలిసి బైక్ స్టంట్ చేస్తున్నాడు. ఒకరు ముందు, మరొకరు వెనుక ఉన్నారు.

ఈ వీడియో ఆధారంగా ముంబై పోలీసులు యువకులపై కేసు నమోదు చేశారు. ముంబై ట్రాఫిక్ పోలీసులు స్పందిస్తూ.. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశాం. నిందితుడిని గుర్తించడానికి దర్యాప్తు జరుగుతోంది. ఈ వీడియోలోని వ్యక్తుల గురించి ఎవరికైనా సమాచారం ఉంటే, మీరు మాకు నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చని తెలిపారు. డ్రైవ్ చేసిన వ్యక్తి మీదనే కాకుండా ఇద్దరు యువతులపై కూడా కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో ఐపీసీ సెక్షన్ 114 కింద కేసు నమోదు చేశారు.



Next Story