విశాఖలో అర్ధరాత్రి బైక్ రైడర్స్ హల్‌చల్, 8 మంది అరెస్టు
Vizag police crack down on stunt biking, arrest 8. విశాఖ నగరంలోని శనివారం రాత్రి 11.45 గంటల నుంచి ఉదయం 3 గంటల బైక్ రైడర్స్ ఆర్టీసీ కాంప్లెక్స్, సిరిపురం
By అంజి Published on 11 July 2022 10:40 AM ISTవిశాఖ నగరంలోని శనివారం రాత్రి 11.45 గంటల నుంచి ఉదయం 3 గంటల బైక్ రైడర్స్ ఆర్టీసీ కాంప్లెక్స్, సిరిపురం, బీచ్ రోడ్, చినవాల్తేరులో ట్రిపుల్ రైడింగ్‌తో హల్‌చల్ చేశారు. దీంతో వివిధ ప్రాంతాల్లో ప్రమాదకరంగా మోటార్‌బైక్‌పై విన్యాసాలు చేసిన ఎనిమిది మంది యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ర్యాష్, నెగ్లెజెన్స్ యాక్ట్ ప్రకారం నాలుగు కేసులు, ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి చేసినందుకు ఒక కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాత్రిపూట రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్‌కు పాల్పడుతున్న యువకుల గుంపులకు సంబంధించిన వీడియోలు సిటీ పోలీసులకు అందాయి. ఆర్టీసీ డ్రైవర్‌పై కూడా ఓ యువకుడు దాడి చేశాడు. వీడియోల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించి కొంతమంది యువకులను గుర్తించారు.
"శనివారం రాత్రి 35 మందికి పైగా యువకులు ర్యాష్, అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం, బైక్ విన్యాసాలు చేయడం మేము గుర్తించాము. యువకులు రోడ్డున పోయే వాహనాలను అడ్డుకున్నారు. వాహనాలను అనుమతించలేదు. రహదారిని బ్లాక్ చేసినందుకు ఆర్టీసీ డ్రైవర్ వారిని ప్రశ్నించాడు. అయితే యువకులు అతడిని కొట్టి బస్సును ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. మేము బస్సు డ్రైవర్‌పై దాడికి పాల్పడిన యువకుడిని సెక్షన్ 353 332 148 r/w149 IPC, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ నిరోధక చట్టం, 1984 సెక్షన్ 3 కింద అరెస్టు చేశాము." అని పోలీసులు తెలిపారు.
''ర్యాష్, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన ఇతర నిందితులను పట్టుకునేందుకు వేట కొనసాగుతోంది. వారి బైక్‌లను కూడా స్వాధీనం చేసుకున్నాం. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం'' అని డీసీపీ సుమిత్ సునీల్ గరుడ్ తెలిపారు. కొందరు యువకులు రాత్రి వేళల్లో, వారాంతాల్లో బైక్ రేసింగ్‌లు, విన్యాసాలకు పాల్పడుతున్నారని బీచ్ రోడ్డులో నివాసం ఉంటున్న ప్రజలు తెలిపారు.
"యువకులు అధిక వేగంతో వాహనాలను నడుపుతున్నారు. అనేక భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. వారు పాదచారుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు. అటువంటి వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని మేము పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాము. బీచ్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాల ద్వారా నిబంధనలు ఉల్లంఘించిన వారిని గుర్తించి పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు" అని వైజాగ్ నగర నివాసి కె శ్రీనివాస్ అన్నారు.