సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
3 killed in road mishap in suryapet district. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన రెండు బైక్‌లు ఢీ కొట్టుకున్నాయి.
By అంజి Published on
11 Feb 2022 2:14 AM GMT

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన రెండు బైక్‌లు ఢీ కొట్టుకున్నాయి. దీంతో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన ఆత్మకూరు ఎస్ మండలం పరిధిలోని నశింపేట దగ్గర జరిగింది. ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
మృతులను తెట్టుకుంట తండా, బోత్యతండా, లక్ష్మీనాయక్ తండా వాసులుగా గుర్తించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
Next Story