అనంతపురంలో లారీ-ట్రక్కు ఢీ.. ముగ్గురు మృతి

అనంతపురం రూరల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున జ‌రిగిన ఈ ప్ర‌మాదంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెంద‌గా

By Medi Samrat  Published on  17 Dec 2023 3:41 PM IST
అనంతపురంలో లారీ-ట్రక్కు ఢీ.. ముగ్గురు మృతి

అనంతపురం రూరల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున జ‌రిగిన ఈ ప్ర‌మాదంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెంద‌గా.. ఒక వ్యక్తి గాయపడినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వ్యక్తిని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతపురం జిల్లా చిన్నంపల్లి క్రాస్‌ సమీపంలో బండరాళ్లతో వెళ్తున్న లారీ టైరు పంక్చర్ అయ్యి ఆగిపోయింది.. ఆ స‌మ‌యంలోనే అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వెళ్తున్న ఖాళీ ఐచర్ వాహనం వెనుక నుంచి ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ప్ర‌మాదం జ‌రిగింద‌ని పోలీసులు తెలిపారు.

వాహనంలో ఉన్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సుభాష్ అనే వ్యక్తికి గాయాలవ‌గా.. అతడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతులు కర్ణాటకకు చెందిన వారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనకు సంబంధించి సమగ్ర వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారని.. ప్రమాదానికి గల కారణాలపై ఇంకా విచారణ జరగాల్సి ఉందని మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.

Next Story