యువకుడిపై హిజ్రాల పైశాచికత్వం.. గుండు కొట్టించి, ఆపై మూత్రం తాగించి..

ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ అమాయక యువకుడి పట్ల కొందరు హిజ్రాలు బరితెగించి ప్రవర్తించారు.

By అంజి  Published on  30 July 2023 11:58 AM IST
Uttar Pradesh, Crime news, Kasganj district

యువకుడిపై హిజ్రాల పైశాచికత్వం.. గుండు కొట్టించి, ఆపై మూత్రం తాగించి..

ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ అమాయక యువకుడి పట్ల కొందరు హిజ్రాలు బరితెగించి ప్రవర్తించారు. వాళ్లు చెప్పినట్టు నడుచుకోలేదని ఆ యువకుడిపై పగ పెంచుకుని దాడికి పాల్పడ్డారు. పక్కా ప్లాన్‌తో అతడిని ఓ చోట పట్టుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆ యువకుడికి గుండు కొట్టి, మొహంపై మూత్రం పోసి ఘోరంగా అవమానించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు హిజ్రాలతో సహా ఐదుగురిని శనివారం అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. జూలై 26న జిల్లాలోని సహవర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ చర్య జరిగింది.

సహవర్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ అనిల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఘటనపై రఫీకుల్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఒక హిజ్రా ఇంట్లో వంట మనిషిగా పనిచేసే రఫీకుల్.. తనకు మరో ముగ్గురు హిజ్రాలతో, వారి ఇద్దరు సహాయకులతో వాగ్వాదం జరిగిందని ఆరోపించారు. జులై 26న ఒంటరి ప్రదేశానికి తీసుకెళ్లి కొట్టారు. నిందితులు తన బ్యాగ్‌లో ఉంచిన రూ.10,000 నగదును లాక్కెళ్లారని, తల క్షౌరము చేసి, వారి మూత్రం తాగించారని కూడా అతను పేర్కొన్నాడు. అతని ఫిర్యాదు ఆధారంగా, నిందితులపై శుక్రవారం ఐపిసిలోని వివిధ సెక్షన్ల కింద సహవర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Next Story