రెండు బ‌స్సులు ఢీ.. ముగ్గురు దుర్మ‌ర‌ణం

3 Dead in bus collision on Greater Noida Expressway.గ్రేట‌ర్ నోయిడాలో ఘోర రోడ్డ ప్ర‌మాదం జ‌రిగింది

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 18 Dec 2022 4:22 AM

రెండు బ‌స్సులు ఢీ.. ముగ్గురు దుర్మ‌ర‌ణం

గ్రేట‌ర్ నోయిడాలో ఘోర రోడ్డ ప్ర‌మాదం జ‌రిగింది. ఆదివారం తెల్లవారుజామున నాలెడ్జ్ పార్క్ సమీపంలో గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వే పై రెండు బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు వ్య‌క్తులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే అధికారులు, పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌టు చేప‌ట్టారు. గాయ‌ప‌డిన ప‌లువురిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వీరిలో ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు.

"నోయిడాలోని నాలెడ్జ్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై రెండు బస్సులు ఢీకొన్నాయి. ముగ్గురు వ్యక్తులు మరణించారు, చాలా మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరు వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉంది "అని గ్రేటర్ నోయిడా పోలీసులు తెలిపారు.

Next Story