పోలీసులే దోచుకోవడం మొదలు పెడితే.. 5 లక్షల కోసం..!

3 cops arrested for looting over Rs 5 Lakh from UP businessman in Kanpur. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రోడ్డుపై వ్యాపారవేత్తను అడ్డగించి బెదిరించి దోచుకున్న ముగ్గురు

By M.S.R  Published on  25 Feb 2023 7:45 PM IST
పోలీసులే దోచుకోవడం మొదలు పెడితే.. 5 లక్షల కోసం..!

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రోడ్డుపై వ్యాపారవేత్తను అడ్డగించి బెదిరించి దోచుకున్న ముగ్గురు పోలీసులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ముగ్గురు పోలీసులు బాధితుడి నుంచి రూ.5,03,000 దోచుకున్నారు. ఈ ఘటన కాన్పూర్‌లోని సచెండి ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధితుడు కాన్పూర్‌లోని దేహత్ జిల్లా నివాసి అయిన వ్యాపారవేత్త. అతనికి హార్డ్‌వేర్ వ్యాపారం ఉన్నట్లు సమాచారం. బాధితుడి ఆరోపణల ప్రకారం, ముగ్గురు పోలీసులు, అందులో ఇద్దరు సివిల్ డ్రెస్‌లో ఉన్నారని.. బాధితుడు సచెండి ప్రాంతం గుండా వెళుతుండగా అతడిని ఆపి సోదాలు చేశారు. వెతికిన తరువాత వారు అతడి నుండి మొత్తం డబ్బును తీసుకుని.. బాధితుడిని కొట్టడం ప్రారంభించారు.

అయితే అతడు జూదం ద్వారా డబ్బు సంపాదించావు, అందుకే మొత్తం డబ్బును నీ వద్ద నుంచి లాక్కున్నామని చెబుతాం.. అంతే కాకుండా ఈ ఘటన గురించి ఎవరికైనా చెబితే అరెస్ట్ చేసి జైలుకు పంపుతామని అతడిని బెదిరించారు. మరుసటి రోజు బాధితుడు సచ్చెండి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో, స్టేషన్ ఇన్‌ఛార్జ్ కేసు దర్యాప్తు చేశారు. అది నిజమని తేలినప్పుడు, సీనియర్ అధికారులకు సమాచారం అందించారు. కాన్పూర్ పోలీస్ కమిషనర్ బిపి జోగ్దంద్ ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసి, వారిని అరెస్టు చేయాలని ఆదేశించారు. నిందితులైన సబ్ ఇన్‌స్పెక్టర్ యతీష్ కుమార్, సబ్ ఇన్‌స్పెక్టర్ రోహిత్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ అబ్దుల్ రఫేలను ఫిబ్రవరి 24న కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశామని, అదే సమయంలో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని తదుపరి చర్యలు తీసుకుంటున్నామని డీసీపీ విజయ్ ధుల్ తెలిపారు.


Next Story