బోల్తాపడిన కారు.. మంటల్లో ఐదుగురు సజీవ దహనం.. మృతుల్లో ముగ్గురు చిన్నారులు
3 Children Among 5 Burnt Alive After Their Car Catches Fire in Rajnandgaon.ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం
By తోట వంశీ కుమార్ Published on
22 April 2022 4:19 AM GMT

ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఓ కారు అదుపు తప్పి కల్వర్టును ఢీ కొట్టి బోల్తా పడింది. అనంతరం కారులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు సజీవ దహనం అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని, మృత్లుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు. కాగా.. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story