మొక్కజొన్న పంటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లి.. 26 ఏళ్ల యువకుడు మృతి

26-year-old electrocuted in Kothagudem district. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది.జిల్లాలోని చెర్ల మండలంలో మంగళవారం ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి

By అంజి  Published on  4 Jan 2022 7:53 AM GMT
మొక్కజొన్న పంటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లి.. 26 ఏళ్ల యువకుడు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది.జిల్లాలోని చెర్ల మండలంలో మంగళవారం ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి ఓ 26 ఏళ్ల యువకుడు విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడ్డాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఆర్‌కొత్తగూడెం గ్రామానికి చెందిన జి గణపతి(26) కుటుంబం మొక్కజొన్న పంట సాగు చేస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున గణపతి.. మొక్కజొన్న పంటకు నీరు పెట్టేందుకు పొలం దగ్గరికి వెళ్లాడు. అదే సమయంలో నీటిపారుదల పంపు చెడిపోయింది.

దీంతో పంపును రిపేర్ చేసేందుకు పొలానికి సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను స్విచ్ ఆఫ్ చేసేందుకు వెళ్లాడు. ట్రాన్స్‌ఫార్మర్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసేందుకు ప్రయత్నించి విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. ఆ తర్వాత అక్కడికక్కడే కుప్పు కూలి గణపతి మృతి చెందాడు. ఫోన్ చేసినా స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అతని కోసం వెతకగా చివరకు ట్రాన్స్‌ఫార్మర్ వద్ద శవమై కనిపించాడు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కళ్లముందు కనబడిన యువకుడు విద్యుత్‌ షాక్‌తో మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story