మెట్రో స్టేషన్ లిఫ్ట్‌లో మహిళను లైంగికంగా వేధించిన యువకుడు అరెస్ట్‌

26-Year-Old Delhi Man Arrested For Sexually Harassing Woman In Metro Lift. ఏప్రిల్ 4న ఢిల్లీ మెట్రో స్టేషన్‌లోని లిఫ్ట్‌లో మహిళను లైంగికంగా వేధించినందుకు 26 ఏళ్ల యువకుడిని

By M.S.R  Published on  15 April 2023 11:15 AM GMT
మెట్రో స్టేషన్ లిఫ్ట్‌లో మహిళను లైంగికంగా వేధించిన యువకుడు అరెస్ట్‌

Delhi Man Arrested For Sexually Harassing Woman In Metro Lift

ఏప్రిల్ 4న ఢిల్లీ మెట్రో స్టేషన్‌లోని లిఫ్ట్‌లో మహిళను లైంగికంగా వేధించినందుకు 26 ఏళ్ల యువకుడిని ఢిల్లీ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో హౌస్‌కీపింగ్ స్టాఫ్‌గా పనిచేస్తున్న నిందితుడు రాజేష్ కుమార్, దక్షిణ ఢిల్లీలోని జసోలా మెట్రో స్టేషన్‌లో లిఫ్ట్‌లో తన ప్రైవేట్ భాగాలను బయటపెట్టి వేధించడమే కాకుండా.. ఒక మహిళను అసభ్యంగా తాకినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫిర్యాదు అందడంతో పోలీసులు అతడిని వెతకడం మొదలుపెట్టారు. సెక్యూరిటీ కెమెరా ఫుటేజీ, లోకల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రాజేష్‌ని ఎట్టకేలకు పట్టుకున్నారు.

వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్ అయిన మహిళ అతని చర్యలపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో రాజేష్ మెట్రో రైలు ఎక్కకుండానే పారిపోయాడు. దీంతో ఢిల్లీ మెట్రో పోలీసులు వేధింపులకు సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పుడు రాజేష్ జైలు పాలయ్యాడు.


Next Story