12వ తరగతి బాలిక దారుణ హత్య.. శారీరక సంబంధానికి ఒప్పుకోకపోవడంతో..

25-year-old man arrested for killing 18-year-old girl. చండీగఢ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. తనతో శారీరక సంబంధానికి ఒప్పుకోలేదని బాలికను ఓ యువకుడు

By అంజి  Published on  23 Nov 2022 11:40 AM IST
12వ తరగతి బాలిక దారుణ హత్య.. శారీరక సంబంధానికి ఒప్పుకోకపోవడంతో..

చండీగఢ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. తనతో శారీరక సంబంధానికి ఒప్పుకోలేదని బాలికను ఓ యువకుడు గొంతుకోసి చంపేశాడు. ఈ ఘటన బుడేల్‌ గ్రామంలో బాలిక నివాసంలో జరిగింది. 18 ఏళ్ల బాలిక మమతను గొంతు కోసి హత్య చేసినందుకు బీహార్‌కు చెందిన 25 ఏళ్ల మహమ్మద్ షరీక్‌ను చండీగఢ్ పోలీసులు అరెస్టు చేశారు. తనతో శారీరక సంబంధం పెట్టుకోమని బాధితురాలిపై ఒత్తిడి చేశాడు. అయితే అందుకు బాధితురాలు నిరాకరించింది. దీంతో షరీక్‌ కోపంతో బాలిక ఇంట్లోకి చొరబడి గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం చండీగఢ్‌ నుంచి తప్పించుకునేందుకు నిందితుడు ప్రయత్నించాడు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు నిందితుడిని సెక్టార్- 43 బస్టాండ్ సమీపంలో పోలీసులు అరెస్ట్ చేశారు.

నిందితుడు మహ్మద్ షరీక్ వివాహం చేసుకున్నట్లు అమ్మాయికి తెలుసు. ఈ కారణంగా తనతో సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేస్తున్న షరీక్‌తో అమ్మాయి మాట్లాడటం మానేసింది. ఇద్దరూ బురైల్‌లో కలుసుకున్నారు. యువకుడు, బాలిక ఎదురెదురుగా ఉన్న ఇళ్లలో అద్దెకు ఉంటున్నారు. నిందితుడు వాస్తవానికి బీహార్‌లోని మధుబని జిల్లా బేలా గ్రామ నివాసి. హత్య అనంతరం పరారీలో ఉన్న మహ్మద్ షరీఖ్‌ను చండీగఢ్‌లోని సెక్టార్-43 బస్టాండ్ సమీపంలో పోలీసులు అరెస్ట్ చేశారు.

చనిపోయిన బాలిక తల్లి.. పని మనిషిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. బాలిక తండ్రి ఉత్తరప్రదేశ్‌లోని తన స్వగ్రామంలో ఉంటున్నాడు. 6వ తరగతి చదువుతున్న బాధితురాలి సోదరుడు నవంబర్ 19న ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మధ్యాహ్నం తిరిగి వచ్చేసరికి తన అద్దె ఇంటి మెయిన్ డోర్ తెరిచి ఉండడంతో పాటు మంచంపై అపస్మారక స్థితిలో పడి ఉన్న అక్క కనిపించింది. కొడుకు ద్వారా సమాచారం అందించిన వెంటనే, బాలిక తల్లి సంఘటనా స్థలానికి చేరుకుని గట్టిగా కేకలు వేసింది. బాలికను ప్రభుత్వ మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకెళ్లారు. అయితే అప్పటికే బాధితురాలు చనిపోయిందని వైద్యులు తెలిపారు.

మృతురాలు ప్రభుత్వ పాఠశాలలో 12వ తరగతి చదువుతుండగా, మహ్మద్‌ షరీక్‌ ఓ హోటల్‌లో ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా పని చేశాడు. మహ్మద్ షరీఖ్ తనకు ఇదివరకే పెళ్లయిందని మృతురాలితో చెప్పలేదని, గత కొన్ని నెలలుగా మృతురాలితో అక్రమ సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి తెస్తున్నాడని బాధితురాలు కుటుంబ సభ్యులు ఆరోపించారు. చండీగఢ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రాథమిక విచారణలో ఇది వన్ సైడ్ లవ్ కేసుగా తెలుస్తోంది. అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు ముందు బాలికపై అత్యాచారం జరిగిందా అనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొద్దిరోజులుగా బాలికతో ప్రేమ వ్యవహారం సాగించాలని మహ్మద్ షరీక్ ఒత్తిడి చేస్తున్నాడని, అయితే మహ్మద్ షరీక్‌కు అప్పటికే వివాహమైందని బాలికకు తెలిసిందని మృతురాలి తల్లి పోలీసులకు సమాచారం అందించింది.

Next Story