యువతిపై కానిస్టేబుల్‌ అత్యాచారం.. గొంతు నులిమి చంపి.. ఆపై ఉరి వేసి..

25 ఏళ్ల దళిత మహిళపై పోలీసు కానిస్టేబుల్ అత్యాచారం చేసి, గొంతు నులిమి చంపాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

By అంజి  Published on  3 Jan 2024 5:52 AM
Agra, Uttar Pradesh, Crime news

యువతిపై కానిస్టేబుల్‌ అత్యాచారం.. గొంతు నులిమి చంపి.. ఆపై ఉరి వేసి..

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో దారుణం చోటు చేసుకుంది. 25 ఏళ్ల దళిత మహిళపై పోలీసు కానిస్టేబుల్ అత్యాచారం చేసి, గొంతు నులిమి చంపాడు. డిసెంబరు 29న కానిస్టేబుల్ రాఘవేంద్ర సింగ్ (27) అద్దెకు తీసుకున్న గదిలో మహిళ మృతదేహం వేలాడుతూ కనిపించింది. మరణించిన తర్వాత ఉరివేసినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో వెల్లడైంది. నిందిత పోలీసు అధికారిని పోలీసులు అరెస్టు చేశారు. "బెలంగాంజ్‌లోని తన అద్దె గదిలో ఉరివేసుకుని కనిపించిన 25 ఏళ్ల మహిళను హత్య చేసిన కేసులో ఆగ్రాలో పోస్ట్ చేయబడిన రాఘవేంద్ర సింగ్ (27) అనే పోలీసు కానిస్టేబుల్‌ను అరెస్టు చేశారు" అని సీనియర్ పోలీసు అధికారి ఆర్‌కె సింగ్ తెలిపారు.

మహిళ కుటుంబం ప్రకారం.. రాఘవేంద్ర సింగ్, మహిళ ఝాన్సీలో నర్సింగ్ శిక్షణ పొందారు. అప్పటి నుండి పరిచయంలో ఉన్నారు. వారు రాఘవేంద్ర సింగ్ ఇంటికి వెళ్లారని, "అయితే అతని కుటుంబం మా పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందని, అయినప్పటికీ అతను నా సోదరితో సన్నిహితంగా ఉన్నాడు" అని మహిళ సోదరుడు చెప్పాడు. ఘటనకు ఒకరోజు ముందు కానిస్టేబుల్ అద్దెకు తీసుకున్న గదిని మహిళ సందర్శించిందని పోలీసులు తెలిపారు.

"కానిస్టేబుల్ రాఘవేంద్ర సింగ్ ఝాన్సీకి చెందినవాడు. బెళంగాంజ్‌లో అద్దెకు ఉంటున్నాడు. ఇద్దరూ ఒకరికొకరు గతం నుండి తెలుసు. యువతి గురుగ్రామ్‌లోని కిడ్నీ సెంటర్‌లో పనిచేస్తోంది" అని ఆర్‌కె సింగ్ చెప్పారు. సంఘటన జరిగిన రోజు, సింగ్ తన కార్యాలయానికి వచ్చినప్పటికీ, త్వరగా బయలుదేరాడు. అనంతరం జరిగిన విషయాన్ని తన సహోద్యోగులకు తెలిపినట్లు పోలీసులు తెలిపారు. మహిళ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆదివారం కానిస్టేబుల్‌ను అరెస్టు చేశారు.

Next Story