తెలంగాణలో విషాదం..పోటీ పరీక్షలు క్రాక్ చేయలేక యువకుడు సూసైడ్

మంచిర్యాలకు చెందిన 24 ఏళ్ల కిరణ్ అనే యువకుడు పోటీ పరీక్షల్లో వరుస వైఫల్యాల వల్ల తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.

By -  Knakam Karthik
Published on : 22 Feb 2026 9:10 PM IST

Crime News, Telangana, Manchiryal, Youth Dies by Suicide, Competitive Exams, Unemployment, Tragedy

తెలంగాణలో విషాదం..పోటీ పరీక్షలు క్రాక్ చేయలేక యువకుడు సూసైడ్

హైదరాబాద్: మంచిర్యాలకు చెందిన 24 ఏళ్ల కిరణ్ అనే యువకుడు పోటీ పరీక్షల్లో వరుస వైఫల్యాల వల్ల తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లో గ్రూప్-4 పరీక్షల కోసం కోచింగ్ తీసుకున్న అతను, ఉద్యోగం సాధించలేకపోయాననే మానసిక ఒత్తిడితో పురుగుల మందు తాగి ప్రాణాలు విడిచాడు. కోట బొగుడ కాలనీకి చెందిన కిరణ్ మృతితో అతని కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story