జువైనల్‌ హోమ్‌ నుండి 22 మంది మైనర్లు పరారు.. కిటికీ పగులగొట్టి..

జైపూర్‌లోని జువైనల్ హోమ్‌లో కిటికీ పగులగొట్టి 22 మంది మైనర్లు పరారయ్యారు. వీరిలో ఎనిమిది మంది బాలురపై అత్యాచారం కేసులు కొనసాగుతున్నాయి.

By అంజి  Published on  13 Feb 2024 5:33 AM GMT
minors escape, Jaipur, juvenile home, Crime news

జువైనల్‌ హోమ్‌ నుండి 22 మంది మైనర్లు పరారు.. కిటికీ పగులగొట్టి..

జైపూర్‌లోని జువైనల్ హోమ్‌లో కిటికీ పగులగొట్టి 22 మంది మైనర్లు పరారయ్యారు. వీరిలో ఎనిమిది మంది బాలురపై అత్యాచారం కేసులు కొనసాగుతుండగా, 13 మంది బాలురపై హత్యాయత్నానికి పాల్పడిన కేసుల విచారణ జరుగుతోంది. మరో మైనర్‌పై హత్య కేసు నమోదు చేశారు. గార్డుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పారిపోయిన మైనర్ల కోసం గాలింపు చేపట్టారు. సేథి కాలనీలోని జువైనల్ హోమ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రాన్స్‌పోర్ట్ నగర్ పోలీస్ స్టేషన్‌లోని ఒక అధికారి మాట్లాడుతూ.. ''ఉదయం 4 నుండి 5 గంటల మధ్య కిటికీ నెట్‌ను కత్తిరించి అబ్బాయిలు తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని జువైనల్‌ హోమ్‌లోని మైనర్‌ పిల్లల రికార్డులను సేకరించారు'' అని తెలిపారు.

జువైనల్ హోం నుంచి పోలీసులకు ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జువైనల్ హోం నుంచి ఇంత పెద్ద సంఖ్యలో మైనర్లు కలిసి పారిపోవడం ఇదే తొలిసారి. మైనర్‌లను విడిపించేందుకు కొందరు బయటి వ్యక్తులు ప్లాన్ చేసి ఉంటారని పోలీసులు తెలిపారు. మొదట మైనర్లు కిటికీ నెట్‌ను కత్తిరించి, ఆపై ఉదయం వారు పారిపోయారు. డిసిపి (తూర్పు) జ్ఞాన్‌చంద్ యాదవ్ మాట్లాడుతూ.. "మైనర్‌ల ఇళ్లకు, రహస్య ప్రదేశాలకు పోలీసు బృందాలను పంపారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన మైనర్‌లపై నివేదిక దాఖలు చేసి ఫిర్యాదు నమోదు చేయబడుతుంది" అని తెలిపారు. మరోవైపు జువైనల్‌ హోంకు చెందిన గార్డును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Next Story