ట్రక్కు కాలువలో పడి 21 మంది కూలీలు మృతి

అరుణాచల్ ప్రదేశ్‌లో విచారకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. కూలీలతో వెళ్తున్న‌ ట్రక్కు కాలువలో పడి 21 మంది మరణించారు.

By -  Medi Samrat
Published on : 11 Dec 2025 4:52 PM IST

ట్రక్కు కాలువలో పడి 21 మంది కూలీలు మృతి

అరుణాచల్ ప్రదేశ్‌లో విచారకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. కూలీలతో వెళ్తున్న‌ ట్రక్కు కాలువలో పడి 21 మంది మరణించారు. అందిన సమాచారం ప్రకారం.. అస్సాంలోని టిన్సుకియా జిల్లా నుండి రోజువారీ కూలీలను తీసుకువెళుతున్న వాహనం అరుణాచల్ ప్రదేశ్‌లోని ఒక కాలువలో పడిపోయింది. దీని కారణంగా కనీసం 21 మంది చనిపోయారు.

చైనా సరిహద్దుకు సమీపంలోని హ్యులియాంగ్-చగ్లగామ్ రహదారిపై డిసెంబర్ 8 రాత్రి ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రాంతం చాలా దూరంలో ఉండడం, నెట్‌వర్క్ కనెక్టివిటీ లేకపోవడం, రోడ్లు అధ్వాన్నంగా ఉండడంతో బుధవారం సాయంత్రానికి అధికారులకు ఈ సమాచారం అందింది.

Next Story