అడవిలో యువతి మృతదేహం.. మెడపై..?

20-Year-Old Woman Found Dead In UP Forest. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ యువతి అడవిలో విగతజీవై కనిపించింది.

By M.S.R
Published on : 12 April 2023 9:18 PM IST

అడవిలో యువతి మృతదేహం.. మెడపై..?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ యువతి అడవిలో విగతజీవై కనిపించింది. ఫతేపూర్ జిల్లాలోని ఒక అడవిలో మహిళ శవమై కనిపించింది. జఫర్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ జయచంద్ర భారతి మాట్లాడుతూ, గ్రామస్తుల సమాచారం మేరకు 20 ఏళ్ల యువతి మృతదేహం అడవిలో కనిపించింది. యువతి మెడపై గాయం గుర్తులు ఉండడంతో హత్య చేసి అడవిలో పడేసి ఉండొచ్చని అనుమానిస్తూ ఉన్నారు. బాధితురాలి గుర్తింపు కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.

బల్లియాలో ఇటీవలే పవన్ అనే బాలుడి హత్య జరిగింది. హనుమాన్‌గంజ్ గ్రామం నుండి బాలుడిని కిడ్నాప్ చేశారు. పోలీసులు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టగా.. బుధవారం నాడు ఓ గొయ్యిలో పవన్ మృతదేహం లభ్యమైందని సుఖ్‌పురా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ పరాస్ నాథ్ సింగ్ తెలిపారు. అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, మృతిపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.


Next Story