హైదరాబాద్‌లో దారుణం.. 20 ఏళ్ల యువకుడిని కత్తితో పొడిచి చంపారు

సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. శనివారం అర్థరాత్రి 20 ఏళ్ల యువకుడిని కొందరు వ్యక్తులు కత్తితో పొడిచి చంపారు .

By అంజి  Published on  22 Dec 2024 10:38 AM IST
Hyderabad, stabbed, Bowenpally, Crime news

హైదరాబాద్‌లో దారుణం.. 20 ఏళ్ల యువకుడిని కత్తితో పొడిచి చంపారు

హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. శనివారం అర్థరాత్రి 20 ఏళ్ల యువకుడిని కొందరు వ్యక్తులు కత్తితో పొడిచి చంపారు . బోయిన్‌పల్లిలోని హర్షవర్ధన్‌ కాలనీలో నివాసముంటున్న మహ్మద్‌ సమీర్‌ అనే వ్యక్తిని ఓ మహిళకు సంబంధించిన సమస్యపై చర్చించేందుకు కొంతమంది వ్యక్తులు పిలిచారు. ఆ తర్వాత అతనిపై నలుగురు వ్యక్తులు పదునైన ఆయుధాలతో దారుణంగా దాడి చేశారు. వ్యక్తికి తీవ్ర గాయాలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ అనంతరం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మృతుడు సమీర్ కొద్ది రోజుల క్రితం ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోగా, వారి బంధువులే ఈ పని చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. హత్య జరిగిన ప్రాంతాన్ని నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్ పరిశీలించడం తో పాటు, ప్రత్యక్ష సాక్షులను విచారించారు. హత్య చేసి బహిరంగంగా తామే చంపేశామంటూ అరుస్తూ అక్కడి నుంచి కొంతమంది యువకులు వెళ్లారని స్థానికులు పోలీసులకు తెలియజేశారు. గతంలో తాను పని చేసే యజమాని కుమార్తె ఫిర్ధోజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో పరువుతో ఈ హత్య జరిగినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story