ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా..
Selfie leads to a person die in Tamilnadu. సెల్ఫీ పిచ్చిలో పడి యువత ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఓ యువకుడి సేల్ఫీ సరదా అతని ప్రాణాలు బలిగొంది.
By Medi Samrat Published on 16 May 2021 3:27 PM ISTసెల్ఫీ పిచ్చిలో పడి యువత ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టేందుకు, స్నేహితుల దగ్గర గొప్పలు పోయేందుకు వింత వింత ప్రయోగాలతో ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. తాజాగా తమిళనాడులో ఇలాంటి సంఘటనే జరిగింది. ఓ యువకుడి సేల్ఫీ సరదా అతని ప్రాణాలు బలిగొంది. తిరుపత్తూరు జిల్లాలోని వాణియంబాడి కి చెందిన 20 ఏళ్ల యువకుడు సమీపంలో లోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాడు. అక్కడ ఉన్న ఒక ట్రాక్టర్ పైకి ఎక్కి సెల్ఫీ తీసుకొని తన స్నేహితులకు పంపాడు. మిత్రులు దానికి చాలా బాగుంది అంటూ కంప్లీమెంట్స్ ఇచ్చారు.
దీంతో ఈసారి ట్రాక్టర్ నడుపుతూ సెల్ఫీ తీసుకుందామని అనుకున్నాడో ఏమో ట్రాక్టర్ డ్రైవింగ్ తెలియక పోయినా సరే వాహనాన్ని స్టార్ చేసాడు. అయితే ట్రాక్టర్ సడన్ గా వెనుకకు కదిలి అక్కడ సుమారు 120 అడుగుల లోతు ఉన్న బావిలోకి జారిపడిపోయింది. పెద్ద శబ్దం రావటం తో ఉలిక్కి పడిన చుట్టుపక్కల వ్యవసాయ కార్మికులు పోలీసులకు, రెస్క్యూ టీమ్ కు సమాచారం ఇచ్చారు. తక్షణం సంఘటనా స్థలానికి చేరుకున్న ఎనిమిది మంది టిఎన్ఎఫ్ఆర్ఎస్ సిబ్బంది మృతదేహాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నించారు అయితే. బావిలో నీరు ఎక్కువగా ఉండటంతో నాలుగు మోటార్ల సహాయంతో నీటిని తోడి.. ట్రాక్టర్ కు తాడు వేసి బయటకు తీశారు. బాలుడి మృతదేహాన్ని బయటకు తీయడానికి వారికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది. మృతుడు సంజీవ్ క్యాటరింగ్‌లో ఒక కోర్సు పూర్తి చేసి, ఈ మధ్యనే చెన్నైలోని ఒక సంస్థలో ఉద్యోగంలో చేరినట్లు అతని బంధువులు చెప్పారు.