ఓఆర్‌ఆర్‌పై ప్రమాదం.. ఇద్దరు మృతి, 8 మందికి గాయాలు

2 killed in accident on Hyderabad’s Outer Ring Road. హైదరాబాద్‌లోని నెహ్రూ ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)పై ఆదివారం జరిగిన రోడ్డు

By అంజి  Published on  5 Feb 2023 6:03 PM IST
ఓఆర్‌ఆర్‌పై ప్రమాదం.. ఇద్దరు మృతి, 8 మందికి గాయాలు

హైదరాబాద్‌లోని నెహ్రూ ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)పై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఎనిమిది మందికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డుకు అవతలివైపు ఉన్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఘట్‌కేసర్‌ నుంచి వస్తున్న మెర్సిడెస్‌ బెంజ్‌ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం వేగంగా వస్తున్న కారు రోడ్డుకు అవతలి వైపు నుంచి ఎదురుగా వస్తున్న క్యాబ్‌ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఢీకొనడంతో రెండు వాహనాలు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు. ఓఆర్‌ఆర్‌లో వారం రోజుల వ్యవధిలో ఇది రెండో ప్రమాదం. ఫిబ్రవరి 3న హిమాయత్‌సాగర్‌ వద్ద వారు ప్రయాణిస్తున్న కారు ట్రక్కును ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. 100 కి.మీ వేగంతో రూపొందించబడిన ఎనిమిది లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే ఇటీవలి కాలంలో ర్యాష్ డ్రైవింగ్ కారణంగా అనేక ప్రమాదాలను చూసింది.

2021లో ఓఆర్‌ఆర్‌పై జరిగిన 74 ప్రమాదాల్లో మొత్తం 58 మంది చనిపోయారు. గతేడాది ప్రమాదాల సంఖ్య దాదాపు 20 శాతం తగ్గింది.

Next Story