హైదరాబాద్‌లో కలకలం.. 18 ఏళ్ల యువకుడిని కత్తితో పొడిచి చంపేశారు

హైదరాబాద్ మహా నగరంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. సంతోష్‌నగర్‌లో బుధవారం రాత్రి 18 ఏళ్ల యువకుడిని కొందరు యువకులు కత్తితో పొడిచి చంపారు.

By అంజి  Published on  21 Nov 2024 12:45 PM IST
Hyderabad, Santoshnagar, Crime

హైదరాబాద్‌లో కలకలం.. 18 ఏళ్ల యువకుడిని కత్తితో పొడిచి చంపేశారు 

హైదరాబాద్ మహా నగరంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. సంతోష్‌నగర్‌లో బుధవారం రాత్రి 18 ఏళ్ల యువకుడిని కొందరు యువకులు కత్తితో పొడిచి చంపారు. బాధితుడు మహ్మద్ మొహీద్ అనే విద్యార్థి తన తండ్రికి పండ్ల వ్యాపారంలో సహకరించేవాడు. బుధవారం సాయంత్రం మొహీద్‌, అతని స్నేహితులు కొంత మంది యువకులతో గొడవ పడ్డారు. ఆ రాత్రి తరువాత, ప్రత్యర్థి బృందం మొహీద్, అతని స్నేహితులు దర్గా బుర్హాన్-ఎ-షా సమీపంలో కూర్చున్నట్లు గుర్తించి, సమస్యను పరిష్కరించడానికి అక్కడికి వెళ్లారు.

సంతోష్‌నగర్‌ ఏసీపీ మహమ్మద్‌ గౌస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుందని, ఈ క్రమంలో ప్రత్యర్థి వర్గానికి చెందిన ఓ బాలుడు మొహీద్‌ను కత్తితో పొడిచాడని తెలిపారు. మొహీద్‌ను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదైంది.

Next Story