బాలిక‌పై సామూహిక అత్యాచారం.. లైవ్ స్ట్రీమింగ్‌

18 Year old girl molested Two men in Gwalior.మహిళలు, బాలికల సంరక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా ప్రయోజనం లేకుండా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Jun 2022 4:40 AM GMT
బాలిక‌పై సామూహిక అత్యాచారం.. లైవ్ స్ట్రీమింగ్‌

మహిళలు, బాలికల సంరక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా ప్రయోజనం లేకుండా పోతోంది. 18 ఏళ్ల బాలిక‌పై ఇద్ద‌రు వ్య‌క్తులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. అంతేగాకుండా లైంగిక దాడికి సంబంధించిన దృశ్యాల‌ను త‌మ మిత్రుడికి లైవ్‌లో స్ట్రీమింగ్ చేశారు. ఈ దారుణ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని గ్వాలియ‌ర్‌లో చోటు చేసుకుంది. జూన్ 2న ఈ ఘ‌ట‌న జ‌రుగగా శుక్ర‌వారం బాధితురాలు పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

కొత్వాలి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ రాజీవ్ గుప్తా తెలిపిన వివ‌రాల మేర‌కు.. 21 ఏళ్ల వయస్సు ఉన్న‌ ఇద్దరు వ్యక్తులు జూన్ 2న తనను హోటల్‌కు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ బాలిక శుక్రవారం పోలీసులను ఆశ్రయించింది. ఈ అఘాయిత్యాన్ని వీడియోలో మ‌రో స్నేహితుడికి నిందితులు లైవ్ స్ట్రీమ్ చేశార‌ని, అంతేకాకుండా ఫోటోలు, వీడియోలు తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన‌ట్లు బాధితురాలు పిర్యాదులో పేర్కొంద‌ని తెలిపారు. కాగా.. స‌ద‌రు నిందితుల‌పై ఇంత‌క‌ముందు కూడా ఇలాంటి ఆరోప‌ణ‌లే ఉన్నాయ‌ని, ప్ర‌స్తుతం వారు ప‌రారీలో ఉన్న‌ట్లు తెలిపారు. బాలిక ఫిర్యాదు మేర‌కు నిందితుల‌పై పోక్సో చ‌ట్టం, ఐటీ చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశామ‌ని, వారిని ప‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలిపారు.

Next Story