16 ఏళ్ల బాలుడు 58 ఏళ్ల మహిళపై అత్యాచారం.. రెండేళ్ల కిందట జరిగిన ఘటనే కారణం
16-Year-Old Rapes 58-Year-Old Woman, Then Kills Her With A Sickle. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో 16 ఏళ్ల బాలుడు 58 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసి, ఆమెను దారుణంగా
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Feb 2023 8:15 PM ISTమధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో 16 ఏళ్ల బాలుడు 58 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసి, ఆమెను దారుణంగా కొట్టి చంపాడు. ఈ సంఘటన జనవరి 30వ తేదీ రాత్రి హనుమాన పోలీస్ స్టేషన్ పరిధిలోని కైలాష్‌పురి గ్రామంలో జరిగింది బాలుడు ఆమె నోటిలో ప్లాస్టిక్ బ్యాగ్, గుడ్డను నింపి అతి దారుణంగా అత్యాచారం చేశాడు. ఆమె తలపై, ఇతర శరీర భాగాలపై కొడవలితో నరికాడు. ఆమె ప్రైవేట్ భాగాలకు పలు గాయాలు చేశాడని ఓ అధికారి చెప్పారు.
రెండేళ్ల క్రితం ఆ టీనేజర్ తమ సెల్ ఫోన్ దొంగిలించాడని మృతురాలి కుటుంబం ఆరోపించడంతో అతడు ఆమెపై ప్రతీకారం తీర్చుకున్నట్టు స్థానిక పోలీసులు ఆదివారం వెల్లడించారు. నిర్మాణంలో ఉన్న భవనంలోనే బాధితురాలు తన కుటుంబంతో కలిసి నివసించేది. జనవరి 30న ఇంట్లో ఆమె భర్త, కుమారుడు లేని సమయంలో నిందితుడు ప్రవేశించాడు. నిద్రిస్తున్న బాధితురాలికి మెలకువ వచ్చి అరిచేందుకు ప్రయత్నించడంతో ఆమె నోట్లో గుడ్డలు, ప్లాస్టిక్ బ్యాగ్ కుక్కాడు. బాధితురాలి మొహంపైన ప్లాస్టిక్ బ్యాగ్ కప్పి భవంతిలో నిర్మాణం పనులు జరుగుతున్న చోటికి లాక్కెళ్లాడు.
ఆపై ఆమెను తలుపుకు కట్టేసి, పదే పదే కొట్టాడు. ఊపిరాడక మూర్ఛపోయిన ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. మహిళ ఇంట్లో ఉన్న రూ.1000 నగదు, బంగారు నగలు తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఫిబ్రవరి 1నస్థానికులు మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎట్టకేలకు నిందితుడిని పోలీసులు పట్టుకుని ప్రశ్నించగా.. చేసిన నేరాన్ని అంగీకరించాడు. అనవసరంగా తనపై దొంగతనం ఆరోపణలు మోపారని.. అందుకే తాను ఈ దారుణానికి తెగబడ్డాడని నిందితుడు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు.
అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP) వివేక్ లాల్ మాట్లాడుతూ, నిర్మాణంలో ఉన్న భవనం వద్ద 58 ఏళ్ల మహిళ మృతదేహం పడి ఉన్నట్లు ఫిబ్రవరి 1 న సమాచారం అందింది. పోలీసులు, ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని మహిళను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసినట్లు తేలిందని తెలిపారు. ఆ తర్వాత విచారణలో బాలుడితో ఉన్న గొడవ బయటపడడం.. అతడిని విచారించడంతో మొత్తం దారుణం బయటకు వచ్చింది.