Hyderabad: హాస్టల్‌లో శవమై కనిపించిన 16 ఏళ్ల విద్యార్థిని

హైదరాబాద్‌లో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. తన హాస్టల్‌లో 16 ఏళ్ల ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆదివారం రాత్రి శవమై కనిపించింది.

By అంజి
Published on : 27 Jan 2025 12:49 PM IST

girl student found dead, Hyderabad, hostel, Crime

Hyderabad: హాస్టల్‌లో శవమై కనిపించిన 16 ఏళ్ల విద్యార్థిని

హైదరాబాద్‌లో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. తన హాస్టల్‌లో 16 ఏళ్ల ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆదివారం రాత్రి శవమై కనిపించింది. ఈ ఘటన హయత్‌నగర్‌లోని కుంట్లూరులో చోటుచేసుకుంది. సౌమ్య అనే బాలిక తన కళాశాలకు సమీపంలోని మైనారిటీ గురుకుల హాస్టల్‌లో ఉంటున్న ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని. సాయంత్రం సమయంలో సౌమ్య తన రూమ్‌మేట్ బయటకు వెళ్లిపోవడంతో తన గదిలో ఒంటరిగా ఉంది. ఈ సమయంలో ఆమె సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

ఆమె స్నేహితులు తిరిగి వచ్చినప్పుడు, వారు పదేపదే తలుపు తట్టినప్పటికీ వారికి ఎటువంటి స్పందన లేదు. దీంతో ఆందోళన చెందిన వారు హాస్టల్ అధికారులను అప్రమత్తం చేశారు. తలుపు బద్దలు కొట్టి చూడగా సౌమ్య ఎంతకూ స్పందించలేదు. అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తరలించారు. సౌమ్య చర్యల వెనుక ఖచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ, ప్రాథమిక పోలీసు పరిశోధనలు ఆమె బాధతో ఉండవచ్చని సూచిస్తున్నాయి. ఈ హృదయ విదారక సంఘటనకు దారితీసిన పరిస్థితులను వెలికితీసేందుకు హయత్‌నగర్ పోలీసులు సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు.

Next Story