ఢిల్లీలో 14 ఏళ్ల బాలికపై తాంత్రికుడు అత్యాచారం

14-yr-old raped by tantrik in Delhi. పశ్చిమ ఢిల్లీలోని బాబా హరిదాస్ నగర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది.

By అంజి  Published on  19 Feb 2023 3:35 PM IST
ఢిల్లీలో 14 ఏళ్ల బాలికపై తాంత్రికుడు అత్యాచారం

పశ్చిమ ఢిల్లీలోని బాబా హరిదాస్ నగర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. భూతవైద్యం సాకుతో 14 ఏళ్ల బాలికపై తాంత్రికుడు పలు సందర్భాల్లో అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బాధితురాలు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉంది. ఈ క్రమంలోనే బాధితురాలి తల్లి ఆమెను చికిత్స కోసం నిందితుడి వద్దకు తీసుకువెళ్లింది. ఆ తర్వాత భూతవైద్యుడు బాలికను ఒంటరిగా గదిలోకి తీసుకువెళ్లి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

తన కుమార్తె రెండు నెలల గర్భవతి అని ఆమె తల్లికి తెలిసిందని, ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించాలని నిర్ణయించుకున్నట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు బాబా హరిదాస్ నగర్‌లో పోక్సో కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారం చేయడంతో గర్భం దాల్చింది. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతనిని పట్టుకోవడానికి తమ పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని పోలీసు అధికారి తెలిపారు. నిందితుడిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు అధికారి తెలిపారు. తాంత్రికుడిపై పోక్సో కింద కేసు నమోదు చేశారు.

ఈ నెల ప్రారంభంలో హైదరాబాద్‌లో జరిగిన బర్త్‌డే పార్టీలో ఓ మైనర్ బాలికపై ఐదుగురు యువకులు మత్తుమందు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఫిబ్రవరి 4న హైదరాబాద్‌లోని పాతబస్తీలో జరిగిన ఈ షాకింగ్ ఘటన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. పాఠశాల మానేసిన బాధితురాలు తన తల్లితో కలిసి జీవిస్తోంది. తల్లి భర్తను విడిచిపెట్టి, కొన్నేళ్ల క్రితం ఛత్రినాకకు చెందిన మరో వ్యక్తి వద్దకు వెళ్లింది. భారతీయ శిక్షాస్మృతి, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story