కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. 14 మంది దుర్మ‌ర‌ణం

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా విరార్‌లో హృదయ విదారకమైన భారీ ప్రమాదం జరిగింది.

By Medi Samrat
Published on : 28 Aug 2025 8:24 AM IST

కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. 14 మంది దుర్మ‌ర‌ణం

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా విరార్‌లో హృదయ విదారకమైన భారీ ప్రమాదం జరిగింది. నాలుగు అంతస్తుల అక్రమ భవనంలో కొంత భాగం బుధవారం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో తల్లీకూతుళ్లతోపాటు 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సహాయక చర్యలు ఇంకా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బుధవారం అర్ధరాత్రి 12:05 గంటల ప్రాంతంలో రమాబాయి అపార్ట్‌మెంట్‌ వెనుక భాగం ఒక్కసారిగా కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ భవనం 2012 లో నిర్మించబడింది. అయితే ఈ నిర్మాణం పూర్తిగా చట్టవిరుద్ధం.

ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు బిల్డర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వసాయి-విరార్ మున్సిపల్ కార్పొరేషన్ (VVMC) ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్)కి చెందిన రెండు బృందాలు సంఘటనా స్థలంలో సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి. శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకునే అవకాశం ఉందని పాల్ఘర్ జిల్లా కలెక్టర్ ఇందు రాణి జాఖర్ తెలిపారు. ప్రమాదంలో ఇప్పటి వరకు 17 మందిని గుర్తించామని, అందులో 14 మంది మరణించగా, ఒకరు గాయపడగా, ఇద్దరిని సురక్షితంగా ఉన్న‌ట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం స‌హాయ‌క పనులు శరవేగంగా జరుగుతున్నాయని వీవీఎంసీ అసిస్టెంట్‌ కమిషనర్‌ గిల్సన్‌ గోన్‌సాల్వేస్‌ తెలిపారు.

Next Story