ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ట్ర‌క్కును ఢీ కొట్టిన బ‌స్సు.. 15 మంది కూలీలు దుర్మ‌ర‌ణం

14 Dead as bus collides with truck in Rewa.మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Oct 2022 9:07 AM IST
ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ట్ర‌క్కును ఢీ కొట్టిన బ‌స్సు.. 15 మంది కూలీలు దుర్మ‌ర‌ణం

మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ట్ర‌క్కును బ‌స్సు వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో 15 మంది దుర్మ‌ర‌ణం చెంద‌గా మ‌రో 40 మంది వ‌ర‌కు గాయ‌ప‌డ్డారు.

హైద‌రాబాద్ నుంచి ఉత్త‌ర‌ప్రదేశ్‌లోని గోర‌ఖ్‌పూర్‌కు ప్ర‌యాణీకుల‌తో వెలుతున్న బ‌స్సు శ‌నివారం తెల్ల‌వారుజామున ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని రేవా ప్రాంతంలో ముందు వెలుతున్న ట్ర‌క్కును ఢీ కొట్టింది. దీంతో బ‌స్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. బ‌స్సులో ముందు భాగంలో కూర్చున్న 15 మంది అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు.

స‌మాచారం అందుకున్న వెంట‌నే అధికారులు, పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మ‌రో 40 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. వీరిని స‌మీపంలోని ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. వీరిలో 20 మంది ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌డంతో ప్ర‌యాగ్‌రాజ్‌లోని ఆస్ప‌త్రిలో చేర్చిన‌ట్లు రేవా ఎస్పీ న‌వ‌నీత్ భాసిన్ చెప్పారు. మృతులంతా ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాలకు చెందిన కూలీలుగా పోలీసులు తెలిపారు. దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా వారంతా త‌మ స్వ‌స్థ‌లాల‌కు వెలుతున్నారు.

కాగా.. తొలుత ఓ గుర్తు తెలియ‌ని వాహ‌నాన్ని ట్ర‌క్కు ఢీ కొట్టింది. ఈ క్ర‌మంలో ఆ ట్ర‌క్కు వెనుక‌నే వ‌స్తున్న బ‌స్సు అదుపు త‌ప్పి ట్ర‌క్కు ను ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story