ఘోర రోడ్డు ప్రమాదం.. వాహనం బోల్తా.. 14 మంది దుర్మరణం
మధ్యప్రదేశ్‌లోని దిండోరిలోని బద్జర్ ఘాట్ వద్ద గురువారం పికప్ వాహనం అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో 14 మంది మృతి చెందారు.
By అంజి Published on 29 Feb 2024 8:06 AM ISTఘోర రోడ్డు ప్రమాదం.. వాహనం బోల్తా.. 14 మంది దుర్మరణం
మధ్యప్రదేశ్‌లోని దిండోరిలోని బద్జర్ ఘాట్ వద్ద గురువారం పికప్ వాహనం అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో 14 మంది మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు షాపురా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారని వికాస్ మిశ్రా డిండోరి కలెక్టర్ తెలిపారు. మృతులను పోస్ట్‌మార్టం కోసం పంపారు.డ్రైవర్.. వాహనంపై నియంత్రణ కోల్పోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. దిండోరి జిల్లాలోని షాహ్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో బాధిత ప్రజలు ' గోద్ భరై ' కార్యక్రమం నుండి తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగింది.
ఈ ఘటన తర్వాత మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మృతుల కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు వైద్యసేవలు అందించాలని స్థానిక అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. అంతేకాకుండా, సహాయక చర్యలను పర్యవేక్షించడానికి దిండోరీకి వెళ్లాల్సిందిగా క్యాబినెట్ మంత్రి సంపతీయ ఉయికేని కూడా ఆయన ఆదేశించారు.
"దిండోరి జిల్లాలో జరిగిన వాహన ప్రమాదంలో 14 మంది మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ పిడుగుపాటు వార్తను తట్టుకునే శక్తిని కుటుంబ సభ్యులకు ఇవ్వాలని, మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను'' అని పేర్కొన్నార. ఘటనలో గాయపడిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. క్షతగాత్రులకు తగు చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగానికి సూచనలు చేశారు.