దారుణం.. 13 ఏళ్ల బాలికపై అత్యాచారం.. నెల రోజుల తర్వాత..

13 year old girl raped in Chhattisgarh. ఛత్తీస్‌గఢ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. దుర్గ్‌లో మైనర్ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.

By అంజి  Published on  18 Aug 2022 8:20 PM IST
దారుణం.. 13 ఏళ్ల బాలికపై అత్యాచారం.. నెల రోజుల తర్వాత..

ఛత్తీస్‌గఢ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. దుర్గ్‌లో మైనర్ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.13 ఏళ్ల బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె ఇంట్లోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు ఆమె ఇంట్లోకి చొరబడి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన గురించి ఎవరికైనా చెప్పడానికి ప్రయత్నిస్తే ఆమెతో పాటు, ఆమె కుటుంబాన్ని చంపేస్తానంటూ బాలికను బెదిరించాడు. జులై 11న జ‌రిగిన ఈ దారుణ ఘ‌ట‌న ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

కొద్ది రోజులు మౌనంగా ఉన్న బాలిక ఈ ఘటన గురించి కుటుంబసభ్యులకు చెప్పింది. అయితే భయంతో కుటుంబ సభ్యులు నిందితుడిపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఒక నెల తరువాత మైనర్ బాలిక ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆ వెంటనే, నిందితుడిపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై తదుపరి విచారణ ఇంకా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Next Story