13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. ఆపై ప్రైవేట్‌ భాగాలను కత్తిరించి..

13 year old girl gang raped in Bihar. బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. కొందరు దుండగులు 13 ఏళ్ల

By అంజి  Published on  15 Nov 2022 3:29 PM IST
13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. ఆపై ప్రైవేట్‌ భాగాలను కత్తిరించి..

బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. కొందరు దుండగులు 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత బాలిక జననాంగాలు, రొమ్ము, నాలుకను కోసేశారు. ఆపై ఆమె చనిపోయిందని భావించి తోటలో పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటనతో స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన సమస్తిపూర్ జిల్లాలోని చక్మెహసీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నవంబర్ 11న కొందరు దుర్మార్గులు బాలికను ఇంటి నుంచి ఎత్తుకెళ్లారని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఆ తర్వాత అందరూ కలిసి ఆమెపై అత్యాచారం చేసి బాలికను అపస్మారక స్థితిలో ఇంటి సమీపంలోని తోటలో వదిలేశారు. బాలిక జననంగాలను పళ్లతో కొరకడంతో తీవ్ర గాయాలయ్యాయి. గొంతు నులమడంతో బాలిక మాట్లాడలేకపోతోంది. బాలిక ఆచూకీ కోసం తల్లిదండ్రులు చాలా సేపు వెతికారు. చివరకు బాలిక ఓ తోటలో రక్తపు మడుగులో పడి కనిపించింది. స్థానిక గ్రామస్తులు విరాళాలు సేకరించి బాలికకు వైద్యం అందిస్తున్నారు. బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

"13 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. వాంగ్మూలం తీసుకోవడానికి చక్‌మెహసీ పోలీసులను ముజఫర్‌పూర్‌కు పంపారు. ఈ విషయం విచారణలో ఉంది. ఈ ఘటనకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు' అని సమస్తిపూర్ ఎస్పీ హృదయ్ కాంత్ తెలిపారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో సీపీఐ(ఎంఎల్) బృందం కూడా గ్రామానికి చేరుకుని బాలిక కుటుంబాన్ని పరామర్శించింది. దోషులను శిక్షిస్తామని సీపీఐ(ఎంఎల్) కళ్యాణ్‌పూర్ బ్లాక్ సెక్రటరీ దినేష్ కుమార్, పూసా బ్లాక్ సెక్రటరీ అమిత్ కుమార్ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.

Next Story