ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో దారుణం జరిగింది. ఇక్కడి ఫుర్సత్‌గంజ్ ప్రాంతంలో 13 ఏళ్ల దళిత బాలికపై అత్యాచారం జరిగిందని పోలీసులు బుధవారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 30న మైనర్ బాలిక పొలానికి వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది. అదే గ్రామానికి చెందిన ఒక యువకుడు ఆమెను తన గొట్టపు బావి వద్దకు లాక్కెళ్లి, ఆమెపై అత్యాచారం చేసి, ఈ సంఘటనను ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.
ఆ తర్వాత ఆ బాలిక ఇంటికి తిరిగి వచ్చి జరిగిన దారుణాన్ని తన తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఫుర్సత్‌గంజ్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ నంద్ హౌస్లా యాదవ్ తెలిపారు. "నిందితుడిని అరెస్టు చేయడానికి అనేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశాము. త్వరలో అతన్ని పట్టుకుంటాము" అని స్టేషన్ హౌజ్ ఆఫీసర్ చెప్పారు.