ఎల్‌కేజీ విద్యార్థినిపై టీచర్ కుమారుడు అత్యాచారం.!
13 year old boy rapes 5 year old girl in UP. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా.. బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. రోజు రోజుకు
By అంజి Published on 28 Oct 2021 4:01 PM ISTప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా.. బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. రోజు రోజుకు ఆఘాయిత్యాల ఎక్కువైపోతున్నాయి. తాజాగా ఓ ఐదేళ్ల బాలికపై 13 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటప ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ పరిధిలో జరిగింది. విజయ్‌నగర్ ప్రాంతంలో మంగళవారం ఓ ఐదేళ్ల బాలిక తన సోదరుడితో కలిసి ట్యూషన్ వెళ్లింది. ఆ సమయంలో అక్కడ టీచర్ లేరు. ఇది గమనించిన టీచర్ కుమారుడు.. బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంటికి వెళ్లిన తర్వాత జరిగిన విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. బాలికను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోక్సో యాక్ట్‌తో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడిని నోయిడాలోని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు.
ఈ-రిక్షా నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నానని బాధిత విద్యార్థిని తండ్రి చెబుతున్నాడు. అతని ఐదేళ్ల కూతురు ఎల్‌కేజీ చదువుతోంది. ఆమె ట్యూషన్ కోసం భూస్వామి భార్య వద్దకు వెళ్తుంది. మంగళవారం కుమార్తె తన సోదరుడితో కలిసి ట్యూషన్‌కు వెళ్లగా.. టీచర్ ఇంట్లో లేరు. బాలికను అక్కడే వదిలి సోదరుడు ఇంటికి వచ్చాడు. దీంతో టీచర్ లేని సమయంలో ఆమెపై 13 ఏళ్ల బాలుడు తన కూతురిపై అత్యాచారం చేశాడు. కూతురు రక్తంతో ఇంటికి చేరుకోవడంతో ఏం జరిగిందని అడగగా జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.