దారుణం.. 12 ఏళ్ల బాలికపై అత్యాచారం.. వీధిలో అర్థనగ్నంగా, రక్తమోడుతూ సాయం కొరితే

12 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురై, నడి రోడ్డుపై అర్థనగ్న స్థితిలో రక్తమోడుతూ సాయం కొరితే ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.

By అంజి  Published on  27 Sept 2023 1:14 PM IST
Madhya Pradesh, Ujjain, Crime news

దారుణం.. 12 ఏళ్ల బాలికపై అత్యాచారం.. వీధిలో అర్థనగ్నంగా, రక్తమోడుతూ సాయం కొరితే 

12 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురై, నడి రోడ్డుపై అర్థనగ్న స్థితిలో రక్తమోడుతూ సాయం కొరితే ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. సాయం చేయాలని అడిగితే ఛీదరించుకున్నారే తప్ప.. ఆదుకోలేదు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగింది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో 12 ఏళ్ల బాలిక పాక్షిక నగ్న స్థితిలో, రక్తస్రావంతో వీధుల్లో నడుస్తూ కనిపించింది. మైనర్‌పై అత్యాచారం చేసి, నగరంలోని బాద్‌నగర్‌ రోడ్డులోని దండి ఆశ్రమం సమీపంలో విసిరేశారు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. 1-నిమిషం-7-సెకన్ల నిడివిగల వీడియోలో, అమ్మాయి తనని కప్పి ఉంచుకోని గుడ్డతో రోడ్డుపై నడుస్తున్నట్లు చూపించింది. ఆమె సహాయం కోసం సంప్రదించగా ఒక వ్యక్తి ఆమెను తరిమికొట్టడం వీడియోలో కనిపించింది.

దిక్కుతోచని ఆమె అలాగే నడుచుకుంటూ ఓ ఆశ్రమం ప్రాంగణంలోకి వెళ్లింది. అక్కడి నిర్వాహకులు అత్యాచారం జరిగిందని అనుమానించి, ఆమె ఒంటిపై టవల్‌ కప్పి స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు..ఆమెపై అత్యాచారం జరిగిందని ధ్రువీకరించారు.బాలిక పరిస్థితి విషమంగా ఉన్నందున ఆసుపత్రిలో చేర్చబడింది. చికిత్స కోసం ఇండోర్‌కు పంపబడింది. "కేసు నమోదు చేయబడింది. దోషులను త్వరగా గుర్తించి, పట్టుకోవడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయబడింది. మైనర్ యొక్క వైద్య పరీక్షలో అత్యాచారం నిర్ధారించబడింది" అని సీనియర్ పోలీసు అధికారి సచిన్ శర్మ తెలిపారు. ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందో సరిగ్గా చెప్పలేకపోయింది. కానీ ఆమె ఉచ్ఛారణ ఆమె ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కి చెందినదని సూచిస్తుంది.

Next Story