మేకలను మేపేందుకు వెళ్లిన.. 12 ఏళ్ల బాలికపై పులి దాడి.. మృతి

12-year-old girl dies in tiger attack in Bahraich. అబ్దుల్లా గంజ్ అటవీ ప్రాంతంలో పులి దాడిలో 12 ఏళ్ల బాలిక మృతి చెందింది. అటవీ శాఖ సీనియర్ అధికారి తెలిపిన వివరాల

By అంజి  Published on  9 Jan 2022 12:31 PM IST
మేకలను మేపేందుకు వెళ్లిన.. 12 ఏళ్ల బాలికపై పులి దాడి.. మృతి

నేపాల్ సరిహద్దులోని అబ్దుల్లా గంజ్ అటవీ ప్రాంతంలో పులి దాడిలో 12 ఏళ్ల బాలిక మృతి చెందింది. అటవీ శాఖ సీనియర్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. చెనైని గ్రామానికి చెందిన పరశురామ్ యాదవ్ కుమార్తె సీమా యాదవ్ దట్టమైన చర్దా అడవుల్లో తమ మేకలను మేత కోసం శనివారం బయటకు తీసుకువెళ్లగా, పులి ఆమెను ఈడ్చుకెళ్లింది. బహ్రైచ్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని అబ్దుల్లా గంజ్ రేంజ్‌లో ఈ అడవి ఉందని అటవీ అధికారి అహ్మద్ కమల్ సిద్ధిఖీ తెలిపారు. గ్రామస్తులు, అటవీ సిబ్బంది, రక్తపు మరకలు, పాదముద్రల ద్వారా బాలిక కోసం వెతకగా.. ఆమె తీవ్రంగా గాయపడిన స్థితిలో, తలపై గాయాలతో కనిపించింది. ఆసుపత్రికి చేరుకునేలోపే ఆమె మరణించింది.

బాలిక కుటుంబ సభ్యులకు అటవీశాఖ సహాయం అందించిందని, శవపరీక్ష నివేదిక వచ్చిన తర్వాత నిబంధనల ప్రకారం పరిహారం అందజేస్తామని సిద్ధిఖీ తెలిపారు. పిల్లలు ఒంటరిగా బయటకు వెళ్లకుండా అటవీ సిబ్బంది నిరంతరం గ్రామస్తులను హెచ్చరిస్తున్నారని ఆయన తెలిపారు. గ్రామస్తులు కూడా గుంపులు గుంపులుగా బయటకు వెళ్లాలని సూచించారు. కతర్నియాఘాట్ వన్యప్రాణి విభాగంలో జరిగిన మరో ఘటనలో చిరుతపులి 10 ఏళ్ల చిన్నారిని అడవిలోకి లాగి తీవ్రంగా గాయపరిచింది. డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ ఆకాష్‌దీప్ బధవాన్ చిన్నారిని సంతోష్ యాదవ్‌గా గుర్తించారు. గ్రామస్థులు అప్రమత్తం చేయడంతో చిరుత తీవ్రంగా గాయపడిన యాదవ్‌ను వదిలి అడవిలోకి వెళ్లిపోయిందని ఆయన చెప్పారు. యాదవ్‌ను బహ్రైచ్‌లోని మెడికల్ కాలేజీకి పంపారు. తర్వాత లక్నోలోని ట్రామా సెంటర్‌కు రెఫర్ చేశారు.

Next Story