చాక్లెట్ ఆశచూపి.. ఇంట్లో నాలుగేళ్ల బాలికపై 12 ఏళ్ల బాలుడు లైంగిక దాడి
12-year-old boy assaults minor after promising her money to buy chocolate
By అంజి
మహారాష్ట్రలోని పూణే జిల్లాలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. చాక్లెట్లు కొనిస్తానని ఆశచూపి నాలుగేళ్ల బాలికపై 12 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. పూణేలో చాక్లెట్ కొంటానని, డబ్బు ఇస్తానని చెప్పి నాలుగేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై 12 ఏళ్ల బాలుడిపై కేసు నమోదైంది. బాలిక తన ఇంటికి ఆడుకోవడానికి వెళ్లినప్పుడు అదే పరిసరాల్లో ఉంటున్న బాలుడు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాలిక తల్లి తెలిపింది. గత వారం జరిగిన ఈ వ్యవహారంపై శనివారం పింప్రి చించ్వాడ్ పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ శిక్షాస్మృతిలోని సంబంధిత సెక్షన్లు.. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేయబడింది.
తన కుమార్తె ఆడుకోవడానికి నిందితుడి ఇంటికి వెళ్లిందని ఫిర్యాదుదారు చెప్పారని ఓ పోలీసు అధికారి జాతీయ దినపత్రికకు తెలిపారు. "చాక్లెట్ కొనడానికి డబ్బు ఇస్తానని పొరుగింటి అబ్బాయి బాలికకు ఆశ చూపాడు. ఆ తర్వాత అతను ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లి గమనించి ఇంటికి తీసుకొచ్చింది'' అని అధికారి తెలిపారు. దేశంలో మహిళలపై నేరాలకు అంతం లేకుండా పోతోంది. చిన్న పిల్లలు కూడా తమకు తెలిసి తెలియని వయసులో బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చిన కామాంధుల్లో మార్పు రావడం లేదు.