Hyderabad: స్కూల్‌లో దారుణం.. బాలికకు తోటి విద్యార్థులు ఆ వీడియోలు చూపించి..

సినిమాలు, సోషల్ మీడియా ప్రభావంతో విద్యార్థులు పక్కదారి పడుతున్నారు. చిన్నవయసులోనే ప్రేమ అనే వ్యామోహాంలో పడిపోయి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు.

By అంజి  Published on  16 March 2025 10:15 AM IST
Hyderabad, 10th grade girl, harassed, fellow students, school , Gachibowli

Hyderabad: స్కూల్‌లో దారుణం.. బాలికకు తోటి విద్యార్థులు ఆ వీడియోలు చూపించి.. 

హైదరాబాద్‌: సినిమాలు, సోషల్ మీడియా ప్రభావంతో విద్యార్థులు పక్కదారి పడుతున్నారు. చిన్నవయసులోనే ప్రేమ అనే వ్యామోహాంలో పడిపోయి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. తాజాగా గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్న బాలుడితో బాలిక సన్నిహితంగా ఉంది. అది గమనించిన కొందరు విద్యార్థులు.. వారు సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియో షూట్ చేశారు. ఆ వీడియోని అడ్డం పెట్టుకొని తమతో కూడా సన్నిహితంగా ఉండాలని విద్యార్థినిపై బెదిరింపులకు పాల్పడ్డారు. అంతే కాకుండా విద్యార్థులందరూ కలిసి బాలికకు సన్నిహితంగా ఉన్న వీడియోని మొబైల్‌లో చూపెట్టి బెదిరింపులకు పాల్పడ్డారు.

దీంతో ఆగ్రహం చెందిన విద్యార్థిని వెంటనే బాలుడి సెల్ ఫోన్‌ని పగలగొట్టింది. ఆ తర్వాత సెల్ ఫోన్ కొనివ్వాలంటూ విద్యార్థి బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతేకాకుండా ఈ విద్యార్థి అప్పటికే సన్నిహితంగా ఉన్న వీడియోని మరొకరికి పంపించాడు. ప్రతిరోజు బాలికను బెదిరింపులకు గురి చేస్తూ ఉండడంతో వారి బాధ భరించలేక ముగ్గురు విద్యార్థుల వ్యవహారాన్ని విద్యార్థిని తన తల్లిదండ్రులకు చెప్పింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి.. ముగ్గురు విద్యార్థులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Next Story