ఎక్స్ ప్రెస్ వే మీద ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం

అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు ట్రైలర్ ట్రక్కును ఢీకొనడంతో పది మంది మృతి చెందగా

By Medi Samrat  Published on  17 April 2024 6:45 PM IST
ఎక్స్ ప్రెస్ వే మీద ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం

అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు ట్రైలర్ ట్రక్కును ఢీకొనడంతో పది మంది మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కారు వడోదర నుంచి అహ్మదాబాద్ వెళ్తోంది. ఈ ప్రమాదంలో కారులోని మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు.

కారు వడోదర నుంచి అహ్మదాబాద్‌వైపు వెళ్తున్నప్పుడు.. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న ట్రైలర్‌ ట్రక్కును బలంగా ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో కారులో 10 మంది ఉన్నారు. వారిలో ఎనిమిది మంది స్పాట్‌లోనే చనిపోగా.. మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు, అంబులెన్స్‌ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో ఎక్స్‌ప్రెస్‌వేపై భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Next Story