ఘోర ప్రమాదం.. ఏడుగురు పిల్లలు సహా 10 మంది మృతి

రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున వ్యాన్‌, కంటైనర్‌ ఢీ కొట్టుకున్నాయి.

By అంజి
Published on : 13 Aug 2025 7:19 AM IST

10 killed , Rajasthan,  Dausa

ఘోర ప్రమాదం.. ఏడుగురు పిల్లలు సహా 10 మంది మృతి

రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున వ్యాన్‌, కంటైనర్‌ ఢీ కొట్టుకున్నాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు పిల్లలు, ముగ్గురు మహిళలు సహా పది మంది మృతి చెందారు. సాలాసర్ బాలాజీ ఆలయం నుండి తిరిగి వస్తున్న భక్తులతో కూడిన పికప్ వ్యాన్ బుధవారం తెల్లవారుజామున ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టడంతో ఈ సంఘటన జరిగింది. బాపి సమీపంలోని దౌసా-మనోహర్‌పూర్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది.

"ఖాతు శ్యామ్ ఆలయం నుండి వస్తున్న భక్తులు ప్రమాదానికి గురైనట్లు సమాచారం అందింది. ఇప్పటివరకు 10 మంది మరణించారు. దాదాపు 7-8 మందిని జైపూర్‌లోని SMS ఆసుపత్రికి రిఫర్ చేశారు..." అని పోలీసు సూపరింటెండెంట్ సాగర్ రాణా ప్రమాదాన్ని ధృవీకరిస్తూ తెలిపారు.

Next Story