చివరి క్షణంలో ఏమైంది.. చెల్లెలితో ఏం మాట్లాడింది..!

By అంజి  Published on  28 Nov 2019 10:28 AM GMT
చివరి క్షణంలో ఏమైంది.. చెల్లెలితో ఏం మాట్లాడింది..!

రంగారెడ్డి: షాద్‌నగర్‌ పీఎస్‌ పరిధిలో చటాన్‌పల్లిలో వెటర్నరీ డాక్టర్‌ ను దుండగులు దారుణంగా హత్య చేశారు. ప్రియాంకరెడ్డిపై పెట్రోల్‌ పోసి నిప్పటించి సజీవదహనం చేశారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

చివరి క్షణంలో ఏమైంది...

మృతురాలు శంషాబాద్‌లో నివాసముంటున్నారు. బుధవారం సాయంత్రం మాదాపూర్‌లోని ఓ క్లినిక్‌ ట్రీట్‌మెంట్‌కు వెళ్తున్నానని చెప్పిందని తల్లిదండ్రులు తెలిపారు. అయితే ఆ రోజు సాయంత్రం స్కూటీపై వెళ్లినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తిరిగి ఇంటికి వచ్చే సమయంలో తన స్కూటీ పాడైపోయిందని తన చెల్లెలికి ఫోన్‌ చేసి తెలిపింది. చుట్టు పక్కల చాలా మంది లారీ డైవర్లు ఉన్నారని.. తనకు టెన్షన్‌గా ఉందని కాసేపు మాట్లాడమని తన చెల్లెలితో చెప్పింది. టోల్‌గేట్‌ వద్ద స్కూటీని పార్క్‌ చేయవద్దని టోల్‌సిబ్బంది చెప్పారని.. తాను వేరే ప్రదేశంలో స్కూటీని పార్క్‌ చేశానని ఫోన్‌లో చెప్పింది. తిరిగి ఇంటికి వచ్చే సమయంలో పార్క్‌ చేసిన ప్రదేశంలో స్కూటీ పంక్చర్‌ అయ్యిందని చెప్పడంతో.. స్కూటీని అక్కడి వదిలేసి రావాలని, ఉదయం మెకానిక్‌ను తీసుకొని స్కూటీని తీసుకొద్దమని తన చెల్లి చెప్పింది.

కాగా లారీలోని ఓ వ్యక్తి తన స్కూటీని బాగు చేయించడానికి షాప్‌కి తీసుకెళ్లడాని చెప్పింది. రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్లవద్దని దెయ్యాలు తిరుగుతున్నాయని చెప్పాడని తెలిపింది. అక్కడ మెకానిక్‌ షాపు క్లోజ్‌ చేసి ఉండడంతో వేరే షాపు తీసుకువెళ్లి బాగు చెపిస్తానని తీసుకెళ్లడాని, లారీల డ్రైవర్లు చాలా మంది ఉన్నారని తనకు చాలా భయమేస్తోందని ఫోన్‌లో చెప్పింది. టోల్‌ బూత్‌ దగ్గరికి వెళ్లాలని చెల్లెలు సూచించింది. దీంతో నాకు ఎడుపు వస్తోందంటూ తన చెల్లిలెకి చెప్పుతూ వాపోయింది. స్కూటీ తీసుకెళ్లిన వ్యక్తి వచ్చే వరకూ మాట్లాడమని మృతురాలు తన చెల్లికి చెప్పింది. తనకు చాలా టెన్షన్‌గా ఉందని కొద్దిసేపు మాట్లాడాలని చెల్లెలిని వేడుకుంది. తనకు వేరే పని ఉందని కాసేపు అయ్యాక ఫోన్‌ చెస్తానని చెల్లి ఫోన్‌ కట్‌ చేసింది. ఆ తర్వాత కాల్‌ చేస్తే ఎంతకు ఫోన్‌ కలవలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సజీవ దహనం చేశారని తెలిపారు. కాగా కూతురు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Next Story
Share it