కోజికోడ్ విమాన ప్ర‌‌మాదంపై టీమిండియా క్రికెట‌ర్ల స్పంద‌న‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Aug 2020 1:38 PM IST
కోజికోడ్ విమాన ప్ర‌‌మాదంపై టీమిండియా క్రికెట‌ర్ల స్పంద‌న‌

దుబాయ్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం కోజికోడ్‌ విమానాశ్రయం రన్‌వేపై ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 19కి చేరింది. గాయపడిన 171 మంది వేర్వేరు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ఈ విమాన ప్రమాదంపై టీమిండియా మాజీ, ప్ర‌స్తుత క్రికెట‌ర్లు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలప‌డంతో పాటు.. గాయ‌ప‌డిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

  • కోజికోడ్ విమాన ప్రమాదంలో చిక్కుకున్న అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నా. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నా సంతాపం తెలియజేస్తున్నా - సచిన్ టెండూల్కర్‌
  • కోజికోడ్‌ విమాన ప్రమాద బాధితుల కోసం ప్రార్థిస్తున్నాను.. మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి - విరాట్‌ కోహ్లీ
  • షాకింగ్‌ న్యూస్‌.. కోజికోడ్‌లో చోటుచేసుకున్న ఎయిర్ఇండియా ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నా - రోహిత్‌ శర్మ
  • కోజికోడ్‌ నుంచి భయంకరమైన వార్త తెలిసింది. విమానం రెండు ముక్కలవ్వడం చూస్తుంటే భయమేసింది. అందరూ బాగుండాలని ప్రార్థిస్తున్నా -గౌతమ్‌ గంభీర్‌
  • కోజికోడ్ ఘ‌ట‌న‌ దిగ్భ్రాంతికి గురి చేసింది. అందరి కోసం ప్రార్థిస్తున్నా. 2020 దయచేసి కనికరించు - యువరాజ్‌ సింగ్‌

Next Story