మెదడుకు పని చెప్పండి..రివార్డు గెలుచుకోండి..

By రాణి  Published on  25 March 2020 7:18 PM IST
మెదడుకు పని చెప్పండి..రివార్డు గెలుచుకోండి..

కరోనా వైరస్ ను నియంత్రించే దిశగా భారత్ ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల పాటు దేశమంతా లాక్ డౌన్ లో ఉండాలని మంగళవారం రాత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధాని పిలుపు మేరకు ప్రజలంతా లాక్ డౌన్ లో ఉండాలని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సెల్ఫ్ క్వారంటైన్ తోనే కరోనాను జయించగలమని తెలిపారు. హర్యానా ప్రభుత్వమైతే లాక్ డౌన్ తో పాటు..మరో ఆఫర్ ప్రకటించింది. దేశంలో ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుని ప్రజల శ్రేయస్సు కోసం తమ కుటుంబాలను వదిలి పనిచేసే వారికి ఇంటెన్సివ్ ల రూపంలో రూ.100-రూ.1000 ఇస్తామని తెలిపింది.

Also Read : రైల్వే బోర్డు కీలక నిర్ణయం..ఏప్రిల్ 14 వరకు రిజర్వేషన్లపై నిషేధం

హర్యానా ప్రభుత్వం ప్రకటించిన ఈ క్యాష్ రివార్డు పథకానికి కోవిడ్ సంఘర్ష్ సేనాని స్కీం అని పేరు కూడా పెట్టింది. అయితే కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు టీనేజర్, యూత్, సీనియర్ సిటిజన్ ఇలా ఎవరైనా సరే పనిచేస్తే వారికి ఈ క్యాష్ రివార్డును అందించనున్నారు. పనిచేయడమంటే బయటికి వచ్చి పనిచేయడం కాదు..కరోనా నుంచి కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పద్యం, కథ, గేయం, మెసేజ్, స్పీచ్ ఏవైనా చెప్పొచ్చు. అలా చెప్పాక వాటిని ప్రభుత్వం సూచించిన haryana.mygov.in వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

Also Read : ఇన్ స్టా లో కొత్త ఫీచర్..ప్రత్యేకంగా వారికోసమే..

అలా అప్ లోడ్ చేసిన వాటిలో టాప్ 100 ది బెస్ట్ సెలక్ట్ చేసి వారికి క్యాష్ రివార్డును అందజేస్తారు. కరోనా భయంతో లాక్ డౌన్ అవ్వడంతో..చాలామందికి ఇళ్లలో బోర్ కొడుతోందంటూ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అలాంటివారి మెదడుకు కూడా పనిచెప్పేందుకే హర్యానా ప్రభుత్వం ఇలాంటి స్కీం ను ప్రవేశపెట్టింది.

Also Read : ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ఆన్ లైన్ సేవలు బంద్

లాక్ డౌన్ అవ్వడంతో ఇప్పటికే 112 గవర్నమెంట్ స్కూళ్లలో 1.87 లక్షల స్టూడెంట్ల స్టడీకి ఇబ్బంది రాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. లెక్చరర్లు క్లాసుల వీడియో రికార్డు చేసి ఆన్ లైన్‌లో అప్ లోడ్ చేస్తున్నారు.

Next Story