Fact Check : కోవిద్ పేషెంట్స్ క్రికెట్ ఆడడం, లుంగి డ్యాన్స్ చేసిన వీడియోలు గచ్చిబౌలి స్టేడియంలోనివా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Jun 2020 7:09 AM GMTగాంధీ ఆసుపత్రికి చెందిన 500 మంది జూనియర్ డాక్టర్లు ఈ మధ్య స్ట్రైక్ కు దిగారు. తమకు పోలీసుల ప్రొటెక్షన్ కావాలని.. కరోనా పేషెంట్ బంధువులు తమపై దాడులు చేస్తున్నారని జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. తెలంగాణ హెల్త్ మినిస్టర్ ఈటెల రాజేందర్ జూనియర్ డాక్టర్ల డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇవ్వడంతో వారు సమ్మెను విరమించారు. రాష్ట్ర ప్రభుత్వానికి 15రోజుల డెడ్ లైన్ విధిస్తూ.. తమ డిమాండ్ లను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు.
ఇలాంటి సమయంలో కోవిద్-19 పేషెంట్స్ క్రికెట్ ఆడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గచ్చిబౌలి లోని స్టేడియంలో ఉంచిన రోగులు ఇలా క్రికెట్ ఆడుతూ ఉన్నారని పలువురు వీడియోలను షేర్ చేశారు.
This is gachibowli stadium how people r simply playing cricket take action on them pic.twitter.com/SHvIRjb7hm
— Pradeep Netha (@PradeepNetha4) June 11, 2020
ఓ ట్విట్టర్ యూజర్ 'ఇది గచ్చిబౌలి స్టేడియం.. పేషెంట్స్ క్రికెట్ ఆడుతూ ఉన్నారు. వారిపై చర్యలు తీసుకోండి' అని పోస్టు చేశారు.
ఎంతో మంది తమ తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో ఈ వీడియోలను షేర్ చేశారు.
ఇది గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఘటన అంటున్నారని.. నిజమో కాదో తెలుసుకోవాలని కోరుతూ న్యూస్ మీటర్ ఫ్యాక్ట్ చెక్ ట్విట్టర్ హ్యాండిల్ @Newsmeterfacts ను కొందరు కోరారు.
స్టేడియంలో లుంగి డ్యాన్స్ చేస్తున్న వీడియో అని.. ఇది గచ్చిబౌలి లోని క్వారెంటైన్ సెంటర్ లో చోటుచేసుకున్న ఘటన అంటూ మరో వీడియోను తాము అందుకున్నాము.
నిజ నిర్ధారణ:
గచ్చిబౌలి లోని క్వారెంటైన్ సెంటర్ లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయన్నది 'పచ్చి అబద్ధం'
వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని సెర్చ్ చేయగా.. క్వారెంటైన్ సెంటర్ లో క్రికెట్ ఆడుతున్నారంటూ వైరల్ అవుతున్న వీడియోలు చాలా ఉన్నాయి. ఫేస్ బుక్ లో కూడా చాలా మంది షేర్ చేశారు. ఈ వీడియో కాశ్మీర్ లోని బారాముల్లా స్టేడియంకు చెందినది.
బారాముల్లా ఇండోర్ స్టేడియం అన్న కీ వర్డ్స్ ను ఉపయోగించి చూడగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోకు.. బారాముల్లా స్టేడియం లోపలి భాగానికి దగ్గరి పోలికలు ఉన్నాయి.
https://kashmirdespatch.com/sports-stadium-turned-covid-19-wellness-center-in-baramulla/
కాశ్మీర్ లోని బారాముల్లా స్టేడియంను ఐసొలేషన్ వార్డుగా మార్చారని గతంలో పలు మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. అందులో ఉన్న వ్యక్తులు క్రికెట్ ఆడారంటూ Oneindia.com కథనాన్ని ప్రసారం చేసింది.
జమ్మూ అండ్ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఈ వీడియోను షేర్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం గచ్చిబౌలి లోని 14 అంతస్థుల స్పోర్ట్స్ టవర్ ను కోవిద్ ఐసొలేషన్ సెంటర్ గా మార్చారు. ఈ స్పోర్ట్స్ టవర్ ను దశాబ్ద కాలంగా క్రీడల కోసం వాడలేదట. గచ్చిబౌలి స్పోర్ట్స్ సెంటర్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు మాత్రమే సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నాయి. వాటికి వైరల్ అవుతున్న వీడియోకు ఎటువంటి సంబంధం కూడా లేదు.
క్వారెంటైన్ సెంటర్ లో రోగులంతా కలిసి లుంగీ డ్యాన్స్ చేస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో కూడా గచ్చిబౌలి స్టేడియంకు సంబంధించినది కాదు. ఈ వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని సెర్చ్ చేయడం జరిగింది. అలాగే ‘COVID patients dancing’ అన్న కీవర్డ్స్ ను ఉపయోగించగా త్రిపురకు చెందిన అగర్తలా లోని ప్రభుత్వ క్వారెంటైన్ సెంటర్ కు సంబంధించిన వీడియో అని తెలుస్తోంది.
గచ్చిబౌలి లోని క్వారెంటైన్ సెంటర్ కు సంబంధించిన వీడియోలు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు 'అబద్ధం'. గచ్చిబౌలి క్రికెట్ స్టేడియంలో ఎవరూ క్రికెట్ ఆడలేదు. లుంగి డ్యాన్స్ పాటకు చిందులు వేయలేదు.