గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగి హల్‌చల్‌

By సుభాష్  Published on  12 May 2020 8:49 AM IST
గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగి హల్‌చల్‌

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. నిన్న ఒక్క రోజే 79 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. అది కూడా ఒక్క హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో కావడం గమనార్హం. అయితే కరోనాతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగి డిశ్చార్జ్‌ చేయాలంటే నానా హంగామా సృష్టించినట్లు సమాచారం. లేదంటే ఆహారం తీసుకోనని భీష్మించడంతో సమాచారం తెలుసుకున్న అధికారులు ఆ వ్యక్తిని సముదాయించినట్లు తెలుస్తోంది. సూర్యాపేటకు చెందిన కరోనా బాధితుడు నెల రోజులుగా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

14 రోజుల అనంతరం పలుమార్లు కరోనా పరీక్షలు చేయడంతో పాజిటివ్‌గానే తేలడంతో వైద్యులు డిశ్చార్జ్‌ చేయలేదు. అయితే పదిహేను రోజుల క్రితం వచ్చిన రోగులను డిశ్చార్జ్‌ చేస్తున్నారని, తనను మాత్రం చేయడం లేదంటూ ఆస్పత్రి సిబ్బందితో తీవ్ర వాగ్వివాదానికి దిగినట్లు తెలిసింది. 14 రోజుల తర్వాత కరోనా పరీక్షలు నిర్వహించిన తర్వాత నెగిటివ్‌ వస్తేనే డిశ్చార్జ్‌ చేస్తామని , ఇది కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనలని సముదాయించినట్లు తెలుస్తోంది.

Next Story