వివాహేతర సంబంధం బయట పడడంతో.. ఆత్మహత్య చేసుకున్న జంట
By తోట వంశీ కుమార్
వివాహేతర సంబంధాల మోజులో పడి చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కట్టుకున్న భర్య లేదా భార్య ఈ మోజులో పడి ఒకరికి ఒకరు ద్రోహం చేసుకుంటున్నారు. తమ సంబంధానికి భార్య లేదా భర్త అడ్డుగా ఉన్నారని భావించి వారిని అడ్డుతొలగించుకునేందుకు ఏ మాత్రం ఆలోచించడం లేదు. తాజాగా ఓ జంట తమ వివాహేతర సంబంధం బయటపడడంతో అవమానంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
ఘటన వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి కి చెందిన బాలనర్సు(38), ప్రేమలత(35) ఇద్దరికి వేర్వేరుగా పెళ్లిళ్లు అయ్యాయి. బాలనర్సుకి భార్య ఇద్దరు కుమారులుగా కాగా.. ప్రేమలతకు భర్త, కుమారుడు ఉన్నారు. వీరిద్దరి మధ్య గత కొంతకాలం వివాహేతర సంబంధం నడుస్తోంది. ఇటీవల ఈ విషయం వారి వారి ఇళ్లలో తెలిసింది. దీంతో వాళ్ల ఇంటిలో గొడవలు మొదలయ్యాయి. తమ విషయం బయటపడడంతో అవమానంతో వీరిద్దరు గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.