722కి చేరిన మృతుల సంఖ్య
By సుభాష్
చైనాలో పుట్టిన కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా గడగడలాడించింది. ఈ వైరస్ వివిధ దేశాలతో పాటు భారత్‌లోకి కూడా చాపకింద నీరులా పాకేసింది. భారత్‌లో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి వైరస్ సోకినట్లు నిర్ధారించారు వైద్యులు. కరోనా అనుమానితులను ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇక చైనాలోఇప్పటి వరకు ఈ వైరస్ బారిన 722 మంది మృతి చెందారు. చైనాలో మొత్తం కరోనా వైరస్ బాదితుల సంఖ్య 34వేల 546 మంది చేరగా, 3వేల 400 మందికి కరోనా వైరస్ లక్షణాలున్నట్లు చైనా జాతీయ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ వైరస్ పుట్టిన ప్రాంతమైన హుబేయ్ ప్రావిన్స్‌లో అత్యధికంగా మరణించినట్లు రికార్డులు చెబుతున్నారు.
ఇక కరోనా వైరస్‌పై చైనా ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించిన వైద్యుడు లీ వెన్‌లియాంగ్ మృతిపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆయన మృతిపై విచారణ జరిపేందుకు చైనా సర్కార్ వుహాన్‌కు దర్యాప్తు బృందాన్ని పంపించింది. వైరస్ గురించి గత ఏడాది డిసెంబర్‌లోనే లీవెన్‌లియాంగ్ వెల్లడించారు. కాగా, ఇలాంటి వదంతులు వ్యాపించవద్దని పోలీసులు అతన్ని హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఆయకు కరోనా సోకి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన మృతిపై ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ప్రజలు సంతాపం వ్యక్తం చేశారు
సహకారం అందించండి
కరోనా వైరస్‌పై ప్రజాయుద్ధం మొదలు పెట్టామని, అమెరికా కూడా తగిన సహకారం అందించాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ట్రంప్‌ను ఫోన్‌లో కోరారు. కరోనావైరస్ గబ్బిలాల నుంచి పాంగోలిన్స్ ద్వారా మనుషులకు సంక్రమించి ఉండవచ్చని చైనా శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు.