'కరోనా'కు అసలైన మందు ఇదేనట..!

By సుభాష్  Published on  4 March 2020 9:20 AM GMT
కరోనాకు అసలైన మందు ఇదేనట..!

కరోనా వైరస్‌ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భయపెడుతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా గురించే చర్చ. చైనాలోని వుహాన్‌లో మొదలైన ఈ మహమ్మారి బారిన దాదాపు 3 వేల వరకు బలయ్యారు. చైనాతో పాటు దాదాపు 80 దేశాలకు పాకింది ఈ కరోనా వైరస్‌. తాజాగా తెలంగాణలో కూడా హడలెత్తిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగి దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చాడు. దుబాయ్‌లో హాంకాంగ్‌ ఉద్యోగులతో పని చేసి అక్కడి నుంచి బెంగళూరు.. తర్వాత హైదరాబాద్‌కు వచ్చాడు. అతనికి కరోనా ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఢిల్లీలో కూడా ఓ కరోనా కేసు నమోదైంది. ఈ ఈ కరోనా వైరస్‌ వ్యాపించడంతో సినీ ప్రముఖులు కరోనా నుంచి ఎలా తప్పించుకోవాలోనని సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు సోషల్‌ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు.

నిమ్మ రసంతో వైరస్‌కు చెక్‌

Prakash Raj

ఇక నిమ్మ రసాన్ని వేడి నీళ్లలో పిండుకుని తాగితే కరోనా సోకదని చెబుతున్నాడు చైనాకు చెందిన బీజింగ్‌ మిలటరీ ఆస్పత్రి సీఈవో చెన్‌ హోరిన్‌. ప్రస్తుతం ఈ వైరస్‌కు మందులేని కారణంగా విటమిన్‌-సీతో ఈ వైరస్‌ నుంచి తప్పించుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా, ఈ విషయాన్ని నటుడు ప్రకాశ్‌ రాజ్‌ ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేశారు. అలాగే ఢిల్లీలో కూడా ఓ కరోనా కేసు నమోదైంది. అలా నిమ్మరసాన్ని తాగినట్లయితే కరోనా నుంచి తప్పించుకోవచ్చని ప్రకాశ్‌ రాజ్‌ చెబుతున్నారు.

కరోనా గురించి యాంకర్‌ సుమా ఏమంటున్నారంటే..

Suma

ఇక ప్రముఖ యాంకర్‌ సుమ కరోనా వైరస్‌ గురించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కరోనా గురించి పెద్దగా భయపడాల్సిన అవసరంలేదని చెబుతున్నారు. వైరస్‌ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. మన సంస్కృతిక, సంప్రదాయ పద్దతులను పాటిస్తే ఈ వైరస్‌ నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు. ఈ వైరస్‌ లక్షణాలు తుమ్ములు రావడం, ముక్కు కారడం, జ్వరం, గొంతునొప్పి, చాతిలో నొప్పి, చలి, గుండె వేగంగా కొట్టుకోవడం, పొడిదగ్గు ఉండటం, ఆయాసం, జీర్ణకోశ సమస్యలు, విరోచనాలు. కానీ ఇవి ఉన్నంత మాత్రన వైరస్‌ సోకిందని కాదు.. ఈ లక్షణాలు ఉన్నా.. వెంటనే వైద్యున్ని సంప్రదించాలంటున్నారు సుమ. ఈ వ్యాధి గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదంటున్నారు.

షేక్‌ హ్యండ్‌ ఇవ్వొద్దు

Coronavirus Tips

ఈ వైరస్‌ గురించి ప్రముఖ సినీయర్‌ బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ కూడా ఈ వైరస్‌ గురించి ఓ చిట్కా కూడా చెప్పారు. కరోనా వైరస్‌ అంటు వ్యాధి కావడంతో దాదాపు ఇతరులతో షేక్‌ హ్యండ్‌ ఇవ్వకపోవడం మంచిదంటున్నారు. భారతీయ సంప్రదాయం ప్రకారం రెండు చేతులను జోడింగ్‌ నమస్కారం పెట్టాలని సూచిస్తున్నారు.

Next Story